హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Earthquake : భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదు.. 12 మంది మృతి

Earthquake : భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదు.. 12 మంది మృతి

ఈక్వెడార్ భూకంపం (image credit - twitter - @thedownliner)

ఈక్వెడార్ భూకంపం (image credit - twitter - @thedownliner)

Earthquake : భూమిని భూకంపాలు వదలట్లేదు. రోజూ ఎక్కడో ఒక చోట భూకంపాలు వస్తూనే ఉన్నాయి. నిన్న టర్కీలో చిన్న భూకంపం రాగా... రాత్రి ఈక్వెడార్‌లో భారీ భూకంపం వచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఈక్వెడార్ తీరంలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.8గా నమోదైంది. ఈ భూకంపం వల్ల 12 మంది చనిపోయినట్లు తెలిసింది. భూమికి 66 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చిందని అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. అదే ఈ భూకంపం... భూమికి 10 కిలోమీటర్ల లోతున వచ్చి ఉంటే.. దీని ప్రభావం అత్యంత ఎక్కువగా ఉండేది.

భూకంప తీవ్రతను 6.5గా ఈక్వెడార్ ప్రభుత్వం అంచనా వేసింది. స్థానిక గ్వాయాస్ (Guayas) ప్రాంతంలో కొన్ని భవనాలు దెబ్బతిన్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. క్యూయెంకాలో ఓ భవనం... కారుపై కుప్పకూలడంతో... కారులోని వ్యక్తి చనిపోయినట్లు తెలిసింది. శాంటా రోసాలో మరో ముగ్గురు చనిపోయారని తెలిసింది. ప్రభుత్వ రిపోర్టుల ప్రకారం... శిథిలాల కింద కొంతమంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

భూకంపం వచ్చినప్పుడు రాజధాని క్విటోకి ఆయిల్ సరఫరా చేసే... ఎస్మెరాల్డాస్ ఆయిల్ పైప్‌లైన్‌ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పుడు తిరిగి సప్లై ప్రారంభించారు.

టర్కీ, ఇండొనేసియా లాగానే... ఈక్వెడార్ కూడా... పసిఫిక్ మహా సముద్రం లోని రింగ్ ఆఫ్ ఫైర్ (Ring of Fire) లోనే ఉంది. ఈ రింగులో అగ్ని పర్వతాలు ఎక్కువ. తరచూ ఇవి పేలుతూ ఉంటాయి. అందువల్ల భూకంపాలు కామన్. ఈక్వెడార్‌లో ఈమధ్య వచ్చిన భూకంపాల్లో 2016లో వచ్చినది తీవ్రమైనది. దాని వల్ల 600 మందికి పైగా చనిపోయారు.

తాజా భూకంపంలో భవనాలు దెబ్బతిన్న ఫొటోలు, వీడియోలూ.. సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. తీర ప్రాంత పట్టణమైన మచాలా (Machala)లో కూలిపోయిన భవనాలున్నాయి.

క్యూయెంకాలో కూడా కూలిన భవనాలు సోషల్ మీడియా పోస్టుల్లో కనిపిస్తున్నాయి.

First published:

Tags: Earth quake, Earthquake

ఉత్తమ కథలు