52 DEAD AND DOZENS INJURED AS ROCKETS STRIKE TRAIN STATION IN EAST UKRAINE PVN
Russia-Ukraine War : చిన్నారులే లక్ష్యంగా ఉక్రెయిన్ రైల్వే స్టేషన్ పై రష్యా రాకెట్ దాడులు..52కి చేరిన మృతుల సంఖ్య
ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం
ROCKETS STRIKE TRAIN STATION : ఉక్రెయిన్ పై రష్యా బలగాలు బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. బలగాలను ఉపసంహరిస్తామన్న రష్యా మాట మార్చింది. ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాలపై ఇంకా క్షిపణులతో విరుచుకుపడుతోంది.
ROCKETS STRIKE TRAIN STATION : ఈ ఏడాది పిబ్రవరి చివర్లో సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై దాడులు ప్రారంభించిన రష్యా వాటిని కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌పై దాడికి దిగి నేటితో 45రోజులు అవుతోంది. అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నా..పుతిన్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. తగ్గేదే లే అన్నట్లుగా.. ఉక్రెయిన్ ను ఉక్కబిరిబిక్కిరి చేస్తున్నారు. ఉక్రెయిన్ పై రష్యా బలగాలు బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. బలగాలను ఉపసంహరిస్తామన్న రష్యా మాట మార్చింది. ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాలపై ఇంకా క్షిపణులతో విరుచుకుపడుతోంది.
అయితే శుక్రవారం తూర్పు ఉక్రెయిన్ లోని క్రమాటోర్స్క్‌లోని రైల్వే స్టేషనే లక్ష్యంగా పుతిన్ సైన్యం రెండు రాకెట్లు ప్రయోగించడం ఈ పెను విషాదానికి దారితీసింది. ఉక్రెయిన్ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్తున్న వారి ప్రయాణాల కోసం ఉపయోగిస్తున్న రైల్వే స్టేషన్ పై రష్యా జరిపిన రాకెట్ దాడుల్లో మృతి చెందినవారి సంఖ్య 52కి చేరింది. మృతిచెందినవారిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో వందల మంది గాయపడ్డారు. గాయపడినవారిలో కూడా ఎక్కువగా మహిళలు,చిన్నారులు ఉన్నారని సమాచారం.
క్రమాటోర్స్క్‌లోని స్టేషన్ వద్ద కనిపిస్తున్న దృశ్యాలలో ... చనిపోయినవారిని టార్ప్లతో కప్పి ఉండగా,కూలిపోయిన ఆ రాకెట్ల మీద "పిల్లల కోసం" అనే పదాలతో రష్యన్ భాషలో పెయింట్ చేయబడి ఉన్నాయి. ఘటన సమయంలో దాదాపు 4,000 మంది పౌరులు స్టేషన్లో మరియు చుట్టుపక్కల ఉన్నారని, డాన్బాస్ ప్రాంతంలో పోరాటం తీవ్రతరం కావడానికి ముందే అక్కడి నుంచి వెళ్లిపోవాలని పిలుపునిచ్చినట్లు ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం తెలిపింది.
రైల్వే స్టేషన్ పై రాకెట్ల దాడని తీవ్రంగా ఖండించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ...రష్యా సైన్యం ఉద్దేశపూర్వకంగా స్టేషన్‌పై దాడి చేసిందని ఆరోపించారు. ఈ దాడి నేపథ్యంలో కఠినమైన ప్రపంచ ప్రతిస్పందనను ఆశిస్తున్నానని తెలిపారు. జెలెన్స్కీ శుక్రవారం తన వీడియో ప్రసంగంలో ఉక్రేనియన్లతో మాట్లాడుతూ... “ఎవరు ఏమి చేసారు, ఎవరు ఏ ఆదేశాలు ఇచ్చారు, క్షిపణి ఎక్కడ నుండి వచ్చింది, ఎవరు రవాణా చేసారు, ఎవరు ఆదేశం ఇచ్చారు అనేదానిని తెలుసోడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.