ఇరాక్‌లో ఘోర విషాదం జరిగింది. అక్కడి ఓ కోవిడ్ ఆస్పత్రిలో సంభవించిన అగ్ని ప్రమాదం వల్ల ఇప్పటికే 52 మంది కరోనా పేషెంట్లు చనిపోగా... మరో 22 మంది గాయాలపాలయ్యారు. అక్కడి రిపోర్టుల ప్రకారం... నసీరియా టౌన్‌లోని అల్ హుస్సేన్ కోవిడ్ ఆస్పత్రి చాలా ఫేమస్. పెద్ద ఆస్పత్రి కూడా. చాలా మంది పేషెంట్లు అక్కడ ట్రీట్‌మెంట్ పొందుతూ ఉంటారు. అక్కడ ఆక్సిజన్ ట్యాంక్ ఒక్కసారిగా పేలింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే అవి ఆస్పత్రిని ఆవహించాయి. డాక్టర్లు, నర్సులూ... తమ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఇక పేషెంట్లను కాపాడటం వారి వల్ల కాలేదు.
వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది. కోవిడ్ వార్డుల్లోకి వెళ్లి... కొంత మంది పేషెంట్లను మాత్రమే బయటకు తీసుకురాగలిగారు.
Death toll from fire at COVID-19 hospital in southern Iraq city of Nasiriyah rises to at least 40.
Our condolences to their families and friends. pic.twitter.com/WRizTMzCLF
— Yazidi الايزيدية (@Ezidi2) July 12, 2021
ప్రస్తుతం మంటల్ని సివిల్ డిఫెన్స్ దళాలు అదుపులోకి తెచ్చాయి. మంటల్లో కాలి బూడిదైన వారి మృతదేహాల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆస్పత్రిలోని కోవిడ్ వార్డులో 70 పడకలు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
BREAKING: Death toll from fire at COVID-19 hospital in Iraq rises to at least 58, including 7 staff members - WaPo pic.twitter.com/g3fFIaBVYz
— BNO Newsroom (@BNODesk) July 12, 2021
ఇరాక్‌లో ఇలాంటి విషాదం 3 నెలల్లో ఇది రెండోసారి. ఆస్పత్రుల్లో సెక్యూరిటీపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు... ఆస్పత్రి బయట ఆందోళన చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ఏరియాలో ఎమర్జెన్సీ ప్రకటించారు. గాయపడిన వారికి సమీప ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ అందుతోంది. ఇరాక్ ప్రధానమంత్రి ముస్తఫా... ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి... మంత్రులతో చర్చించారు. ప్రమాదానికి కారణమేంటో రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Breaking news, Iraq, VIRAL NEWS