Home /News /international /

50 LAKHS MARK REACHED OF CORONA DEATHS IN THE WORLD VRY

World corona deaths : 50 లక్షలకు చేరువలో కరోనా మరణాలు.. అమెరికా ఫస్ట్..భారత్ సెకండ్ ప్లేస్...

World corona update : 50 లక్షలకు చేరువలో కరోనా మరణాలు..

World corona update : 50 లక్షలకు చేరువలో కరోనా మరణాలు..

World corona update : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 50లక్షల మార్క్‌కు దగ్గరలో ఉన్నాయి... కాగా కరోనా పాజీటీవ్‌ల సంఖ్య సమారు 24 కోట్లకు చేరినట్టు యూఎస్‌కు చెందిన హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.

    భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇంకా చాలా దేశాల్లో కరోనా ( corona ) మహమ్మారి ప్రభావం కొనసాగుతున్న విషయం తెలిసిందే... దీంతో ఇప్పటివరకు ప్రపంచ దేశాల్లో ( world wide ) నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23.75 కోట్లకు చేరింది. అటు కరోనా మరణాల సంఖ్య 48.40 లక్షలు దాటి 50 లక్షలకు చేరువ అయ్యింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఈ వివరాలను వెల్లడించింది.

    ఇక అగ్రరాజ్యం అమెరికా ( america ) కరోనా మహమ్మారికి తీవ్రంగా ప్రభావితమైంది. అక్కడ మొత్తం 4,43,17,553 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా మరణాలు కూడా అమెరికాలో భారీగానే నమోదయ్యాయి. మొత్తం 7,12,972 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా తర్వాత 3,39,35,309 కేసులతో భారత్ రెండో స్థానంలో ఉన్నది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా బ్రెజిల్ (2.15 కోట్లకుపైగా), బ్రిటన్ (81.58 లక్షలకుపైగా), రష్యా (76.31 లక్షలకుపైగా), టర్కీ (74.16 లక్షలకుపైగా) దేశాలు ఉన్నాయి.

    ఇది చదవండి : వాళ్లు ఎక్కడ ఉన్న వెతికి చంపుతాం.. ఐసిస్ వార్నింగ్..


    భారత దేశవ్యాప్తంగా 14,146 పాజీటివ్‌ కేసులు

    కేంద్ర ఆరోగ్యశాఖ ( Central health Department ) వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో గత 24 గంటల్లో 11 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించగా.. 14,146 కొత్త కేసులు వెలుగుచూశాయి. శనివారం 144 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 4,52,142కి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 19,788 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3,34,19,749కి చేరింది. రికవరీ రేటు 98.10 శాతానికి చేరింది. గత సంవత్సరం మార్చి తర్వాత ఈ స్థాయిలో రికవరీ రేటు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2 లక్షల దిగువకు వచ్చింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,95,846కి తగ్గింది. పాజిటివిటీ రేటు 0.57 శాతానికి తగ్గి 220 రోజుల కనిష్టానికి చేరింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగానే జరుగుతోంది. శనివారం 41,20,772 మందికి టీకాలు పంపిణీ చేయగా, ఇప్పటి వరకు ఏదో ఒక టీకా డోసు తీసుకున్నవారి సంఖ్య 97.65 కోట్లు దాటింది.

    ఇది చదవండి :  ఆ దేశ సరిహద్దు వెంట భారత్ హై అలర్ట్.. కదలికలను పసిగట్టెందుకు ఆధునిక డ్రోన్


    తెలంగాణలో 122 కొత్త కేసులు ఒకరు మృతి

    ఇక తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజు 26,676 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 122 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ వెల్లడించింది. తాజాగా, నమోదైన 122 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,68,955కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3938గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 540 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 176 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,61,093కి చేరింది.

    జిల్లాల వారిగా కరోనా కేసులు

    ప్రస్తుతం రాష్ట్రంలో 3924 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 98.82 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 00, భద్రాద్రి కొత్తగూడెంలో 08, జీహెచ్ఎంసీలో 55. జగిత్యాలలో 03, జనగామలో 01, జయశంకర్ భూపాలపల్లిలో 00, జోగులాంబ గద్వాలలో 01, కామారెడ్డిలో 00, కరీంనగర్‌లో 09, ఖమ్మంలో 07, కొమురంభీం ఆసిఫాబాద్ లో 00, మహబూబ్‌నగర్‌లో 05, మహబూబాబాద్‌లో 00, మంచిర్యాలలో 02, మెదక్‌లో 00, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 04, ములుగులో 00, నాగర్ కర్నూలులో 01, నల్గొండలో 03, నారాయణపేటలో 00, నిర్మల్‌లో 01, నిజామాబాద్‌లో 01, పెద్దపల్లిలో 01, రాజన్న సిరిసిల్లలో 01, రంగారెడ్డిలో 09, సంగారెడ్డిలో 02, సిద్దిపేటలో 01, సూర్యాపేటలో 02, వికారాబాద్ లో 01, వనపర్తిలో 00, వరంగల్ రూరల్‌లో 01, వరంగల్ అర్బన్‌లో 03, యాదాద్రి భువనగిరిలో 00 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Corona, Corona deaths

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు