Home /News /international /

5 WEAPONS RUSSIA IS YET TO USE IN UKRAINE RUSSIA VS UKRAINE WAR DRAGS ON WILL PUTIN RESORT TO DEADLIER WEAPONS GH VB

Russia Weapons: ఉక్రెయిన్ పై అసలైన ఆయుధాలను ఉపయోగించని రష్యా.. ఆ 5 రకాల ఆయుధాలు ఏవంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉక్రెయిన్‌లో(Ukraine) నెలల తరబడి పోరాటం కొనసాగుతున్నా, ఇంకా తన శక్తివంతమైన ఆయుధాలను క్రెమ్లిన్ రంగంలోకి దింపలేదు. నెలల తరబడి పోరాడుతున్నప్పటికీ, యుద్ధభూమిలో కొన్ని భయంకరమైన రష్యన్ ఆయుధాలు(Weapons) కనిపించలేదు.

ఉక్రెయిన్‌లో(Ukraine) నెలల తరబడి పోరాటం కొనసాగుతున్నా, ఇంకా తన శక్తివంతమైన ఆయుధాలను క్రెమ్లిన్ రంగంలోకి దింపలేదు. నెలల తరబడి పోరాడుతున్నప్పటికీ, యుద్ధభూమిలో కొన్ని భయంకరమైన రష్యన్ ఆయుధాలు(Weapons) కనిపించలేదు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో(War) విజయం సాధించడానికి రష్యా(Russia) వద్ద అనేక ఆయుధాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. అంతకుముందు వ్యూహాత్మక అణు వార్‌హెడ్‌లను ఉపయోగిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin) బెదిరించాడు. రష్యా ముందు ఉన్న మోడ్రన్ ట్యాంక్ ఆప్షన్(Modern Tank Option), ఇది యుద్ధానికి ఇంకా సిద్ధంగా లేదని నిపుణులు చెబుతున్నారు. రష్యా వద్ద రిజర్వ్‌లో ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్(Missile), డూమ్స్‌డే టార్పెడో ఉన్నాయని నివేదికలు తెలుపుతున్నాయి. రష్యా స్పేస్ వెపన్ ప్రమాదకరమైన శిధిలాల క్షేత్రాలను సృష్టించి అమెరికన్ ఉపగ్రహాలను నాశనం చేయగలదని నివేదికల ప్రకారం తెలుస్తోంది.

రష్యా వద్ద ఇప్పటికీ రిజర్వ్‌లో ఉన్న 5 ఆయుధాలు ఏవి..?
యుద్ధభూమిలో ఉపయోగించగల అణ్వాయుధాల విషయానికి వస్తే.. రష్యా వద్ద 2,000 వ్యూహాత్మక బ్యాటిల్‌ఫీల్డ్ న్యూక్లియర్ వెపన్స్‌ రిజర్వ్‌లో ఉన్నాయని అంచనా. ఈ ఆయుధాలు ఎక్కువ ప్రభావం చూపేందుకు వీటిని ఇస్కాండర్ ల్యాండ్ అటాక్ క్షిపణుల ద్వారా డెలివరీ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధంలో పురోగతి లేకపోవడంతో రష్యా నిరాశ చెందుతోందని, దీంతో పుతిన్ వ్యూహాత్మక ఆయుధాలను ఉపయోగించవచ్చని నిపుణులు భయపడుతున్నారు. రష్యన్లు ఇలాంటి ఊహించని దాడులు చేస్తే US లేదా NATO ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. యుద్ధంలో వీటి వినియోగానికి ముందు పుతిన్ మాక్ డ్రిల్‌ నిర్వహించడం ద్వారా కొన్ని సూచనలను పంపుతారని పశ్చిమ దేశాలు భావిస్తున్నారు.

Sri Lanka Crisis: శ్రీలంకలో అరాచకత్వం.. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు.. పారిపోయిన రాజపక్స కుటుంబం

న్యూక్లియర్ టార్పెడోస్.. రష్యా ఆధీనంలో ఉన్న మరో అణు సామర్థ్యం గల వ్యవస్థ ‘పోసిడాన్ అటామిక్ టార్పెడో’. పోసిడాన్ అటామిక్ టార్పెడో స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. వ్యాసం - 7 అడుగులు, పొడవు - 65 అడుగులు, బరువు - 100 టన్నులు, రష్యన్ పోసిడాన్ US నేవీ మార్క్ 48 టార్పెడో కంటే పెద్దది.. దీని బరువు 3,500 పౌండ్లు ఉంటుంది. ఈ సిస్టమ్ 70 knots అంచనా వేగంతో తరంగాల నుంచి వెళ్తుందని నివేదికలు చెబుతున్నాయి. రెండు మెగాటన్‌ల వరకు ఉండే పోసిడాన్ న్యూక్లియర్ వార్‌హెడ్ అయితే పోసిడాన్ మరో ఐదేళ్లపాటు సేవలు అందించలేదు. యుద్ధం కొనసాగితే, ఒడెస్సా నౌకాశ్రయాన్ని బెదిరించేందుకు పుతిన్ అణు టార్పెడోను కాల్చమని ఆదేశించవచ్చు.

T-14 అర్మాటా ట్యాంక్..
రష్యా వ్యూహాత్మక అణ్వాయుధాలను ఉపయోగించాలని నిర్ణయించుకుంటే, యుద్ధభూమికి కొత్త ట్యాంకులను తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. T-14 అర్మాటా ప్రధాన యుద్ధ ట్యాంక్ భయంకరమైనది, కానీ దాన్ని ముందు వరుసలోకి రష్యా తీసుకురాలేదు. పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా T-14 సీరియల్ తయారీ అసాధ్యమని నివేదికలు తెలుపుతున్నాయి. ట్యాంక్ ఉక్రెయిన్‌కు చేరుకుంటే, దాని మానవరహిత టరెంట్ జావెలిన్, NLAW వంటి ట్యాంక్ నిరోధక క్షిపణులకు వ్యతిరేకంగా ఎక్కువ మనుగడ అందించగలదు. T-14లో 125-mm స్మూత్‌బోర్ గన్, ఆటోమేటెడ్ లోడర్ ఉంటాయి. లేజర్-గైడెడ్ క్షిపణులను కాల్చడానికి T-14 మెయిన్ గన్ రూపొందించబడింది.

రిజర్వ్‌లో ఉన్న ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్స్..
రష్యా వద్ద రిజర్వ్‌లో Kh-555 ఎయిర్-లాంచ్డ్ ల్యాండ్-అటాక్ క్రూయిజ్ క్షిపణి ఉన్నా..ఇంత వరకు కనిపించడం లేదు. 2004లో ప్రారంభమైన Kh-555 సేవలు, ఇది Tu-160 బ్లాక్‌జాక్ వ్యూహాత్మక బాంబర్ నుంచి ప్రయోగించగల ఒక లాంగ్ రేంజ్ స్టాండ్‌ఆఫ్ క్షిపణి. Tu-160 బాంబర్ పన్నెండు GPS గైడెడ్ Kh-555 క్రూయిజ్ క్షిపణులను మోసుకెళ్లగలదని నివేదికలు చెబుతున్నాయి. క్షిపణిలో 881-పౌండ్ల వార్‌హెడ్ హై ఎక్స్‌ప్లోసివ్, పెనట్రేటింగ్ హై ఎక్స్‌ప్లోసివ్ లేదా మందుగుండు సామగ్రి ఉంటాయి.

రష్యా ఉపయోగించగల స్పేస్ వెపన్స్..
పోరాటాన్ని రష్యా అంతరిక్షం వరకు తీసుకెళ్లే ఆప్షన్.. ఉక్రేనియన్లకు ఇంటెలిజెన్స్ సేవలు అందిస్తున్న US ఇంటెలిజెన్స్ శాటిలైట్స్‌కు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. 2021 నవంబర్‌లో డైరెక్ట్ ఎస్సెంట్ యాంటీ-శాటిలైట్ టెస్ట్ అని పిలిచే స్పేస్ వెపన్‌ను రష్యన్లు ప్రయోగించగలదు. అమెరికా ఉపగ్రహాలను నాశనం చేయగల క్లౌడ్‌ను సృష్టించడే దీని లక్ష్యంగా మారింది.
Published by:Veera Babu
First published:

Tags: Russia, Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు