పాకిస్తాన్లో దారుణం చోటుచేసుకుంది. హిందూ కుటుంబానికి చెందిన 5 గురు వ్యక్తులను అతి కిరాతకంగా హత్య చేశారు. ఆ ఐదుగురి గొంతులను పదునైన ఆయుదంతో కోసిన గుర్తులు ఉన్నాయి. వివరాలు.. పాకిస్తాన్లోని రహీమ్ యార్ ఖాన్ సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబుదాబి కాలనీలో చాక్ నెం. 135-Pలో రామ్ చంద్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే అతని కుటుంబంలోని ఐదుగురు ఇటీవల హత్య చేయబడ్డారు. పదునైన ఆయుధాలతో గొంతులను కోసిన దుండగులు వారిని హత్య చేశారు. వారిని ఎవరో ప్లాన్ ప్రకారం హత్య చేసి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అలాగే హత్యకు వినియోగించిన కత్తిని, గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించి సోషల్ యాక్టివిస్ట్ బిర్బాల్ దాస్ The News Internationalతో మాట్లాడుతూ.. రామ్ చంద్ అనే Meghwal Hindu కమ్యూనిటీకి చెందినవారని తెలిపారు. అతని వయసు 35 ఏళ్లని.. చాలా కాలంగా ట్రైలర్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడని చెప్పారు. అతడు కుటుంబంతో ప్రశాంతమైన జీవితంతో గుడుపుతున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ గురిచేసిందని అన్నారు.
ఈ ఘటనతో పాకిస్తాన్లోని హిందూ కమ్యూనిటీ ఒక్కసారిగా షాక్కు గురైంది.