ఇరాన్‌లో భూకంపం... రిక్టర్ స్కేల్‌పై 4.9గా నమోదు

ఇరాన్‌లో భూకంపం... రిక్టర్ స్కేల్‌పై 4.9గా నమోదు

ప్రతీకాత్మక చిత్రం

ఈ భూకంపం వల్ల ఇంతవరకు ఎంత నష్టం జరిగిందన్న వివరాలు ఇంకా బయటకు రాలేదు.

  • Share this:
    ఓవైపు ఇరాన్‌పై అమెరికా తన ప్రతాపం చూపిస్తుంటే... మరోవైపు ప్రకృతి సైతం కన్నెర్ర చేస్తోంది. ఇరాన్ దక్షిణ, పశ్చిమలోని బుషహర్ భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.9గా నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. రెండు గంటల విడిదిలో భూమి పలుసార్లు కంపించినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేల్ పై మొదటగా భూకంప తీవ్రత 5.5గా రికార్డ్ అయ్యింది. అయితే ఈ భూకంపం వల్ల ఇంతవరకు ఎంత నష్టం జరిగిందన్న వివరాలు ఇంకా బయటకు రాలేదు.

    అయితే ఇరాన్ దేశానికి వచ్చిన కష్టాలు ఎవరికి రాకూడదంటున్నాయి ప్రపంచ దేశాలు. ఓవైపు అమెరికా వైమానిక దాడులు, మరోవైపు ప్రకృతి వైపరిత్యాలు... ఇది చాలాదన్నట్లు ఇవాళ వేకువజామునే ఇరాన్‌లో ఘోర విమాన ప్రమాదం సైతం చోటు చేుసుకుంది. 170మంది ప్రయాణికులతో వెళ్లిన ఉక్రెయిన్‌కు చెందిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ఘటనలో ప్రయాణికులతో పాటు విమానంలో ఉన్న సిబ్బంది సైతం దుర్మరణం పాలయ్యారు.
    Published by:Sulthana Begum Shaik
    First published: