Home /News /international /

5 KILLED INCLUDING GUNMAN IN DENVER AREA SHOOTING SAYS COLORADO POLICE US SHOOTING MKS

Denver shooting : అమెరికా డెన్వర్ కాల్పుల్లో 5గురు మృతి, టెక్సాస్‌లో ముగ్గుర్ని చంపిన బాలుడు

డెన్వర్ కాల్పుల ఉదంతం దృశ్యాలు

డెన్వర్ కాల్పుల ఉదంతం దృశ్యాలు

అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు పెద్ద ఎత్తున ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. పశ్చిమ అమెరికాలోని కొలరాడో రాష్ట్ర రాజధాని డెన్వర్ సిటీలో సోమవారం జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు చనిపోగా, దక్షిణమధ్య రాష్ట్రం టెక్సాస్ లో ఆదివారం నాడు ఓ బాలుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. వివరాలివి..

ఇంకా చదవండి ...
అగ్రరాజ్యం అమెరికాలో క్రిస్మస్ సీజన్ లో కరోనా వ్యాప్తితోపాటే క్రైమ్ రేటు కూడా అమాంతం పెరిగింది. పండుగ వేళలోనూ దారుణ హత్యోదంతాలు చోటుచేసుకున్నాయి. రెండు రోజుల వ్యవధిలో వేర్వేరు ఘటనల్లో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ అమెరికాలోని కొలరాడో రాష్ట్ర రాజధాని డెన్వర్ సిటీలో సోమవారం జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు చనిపోగా, దక్షిణమధ్య రాష్ట్రం టెక్సాస్ లో ఆదివారం నాడు ఓ బాలుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. వివరాలివి..

అమెరికాలోని కొలరాడో రాష్ట్రం డెన్వర్, లేక్‌వుడ్ నగరాల్లోని నాలుగు వేర్వేరు ప్రదేశాల్లో సోమవారం సాయంత్రం ఒకే వ్యక్తి జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో నిందితుడిని హతమార్చినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. తొలుత డెన్వర్‌లో జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. అనంతరం లేక్‌వుడ్‌కు వెళ్లి అక్కడ మరొకరిని కాల్చి చంపాడు. మరో వ్యక్తిని గాయపరిచాడని పోలీసులు వివరించారు.

Telangana రికార్డు.. ఫస్ట్ డోస్ టీకా 100% పూర్తి -కొత్తగా 7 Omicron కేసులు -228 covid కేసులు



సాయుధుడు కాల్పులు జరుపుతూ ఒక్కో ప్రాంతాన్ని దాటి వెళుతున్నాడనే సమాచారంతో లేక్‌వుడ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అంతకు ముందు జరిగిన సంఘటనల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడి కారును వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నించగా, నిందితుడు కాల్పులకు తెగబడడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడే మరణించినట్టు లేక్‌వుడ్ పోలీసు ప్రతినిధి జాన్ రొమెరో చెప్పారు.

Travel nightmare : ప్రయాణం ఇప్పుడు పీడకల.. వేలకొద్దీ విమానాలు ఆకస్మిక రద్దు.. లక్షల మంది విలవిల



డెన్వర్ కాల్పుల సంఘటనలో ఓ పోలీస్ అధికారి గాయపడ్డాడని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని రొమెరో వివరించారు. నిందితుడు ఏ ఉద్దేశంతో కాల్పులు జరిపాడో తెలియదని, దీనిపై విచారణ సాగుతోందని చెప్పారు. డెన్వర్ కాల్పుల ఘటనలో నిందితుడు సహా మొత్తం ఐదుగురు మరణించారు. ఇదిలా ఉంటే,

అమెరికాలో కొవిడ్ కల్లోలం : రోజుకు 2లక్షల కొత్త కేసులు.. భారీగా పెరిగిన మరణాలు.. రిస్కులో పిల్లలు..



టెక్సాస్ రాష్ట్రంలోని గార్లాండ్ సిటీలో మరో ఘోర కాల్పుల ఉదంతం చోటుచేసుకుంది. సిటీలోని ఓ కన్వీనియన్స్ స్టోర్ లో 14 ఏళ్ల బాలుడు తుపాకి చేతపట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారు, గాయపడ్డ బాధితుడు.. అందరి వయసు 14 నుంచి 16 ఏళ్లలోపే ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడైన 14ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Shooting, Us shooting

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు