Croatia Earthquake: క్రోయేషియాలో భారీ భూకంపం.. భయానక దృశ్యాలు

భూకంప దృశ్యాలు

పెట్రింజాలో చాలా చోట్ల భవనాలు కూలిపోయాయి. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఆర్మీ కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంది.

  • Share this:
    క్రోయేషియాను భారీ భూకంపం వణికించింది. తీవ్రమైన భూకంపం సంభవించడంతో పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలాయి. భూకంప తీవ్రత 6.3గా నమోదయింది. జాగ్రెబ్‌కు 46 కి.మీ. దూరంలో భూకంపకేంద్రాన్ని గుర్తించినట్లు యూరోపియన్ మెడిటేరేనన్ సెస్మలాజికల్ సెంటర్ వెల్లడించింది. సోమవారం కూడా అక్కడ 5.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇక మంగళవారం మరోసారి భూకంపం రావడంతో క్రోయేసియా అల్లకల్లోలమయింది. భూకంప ధాటికి ఇప్పటి వరకు ఐదుగురు మరణించారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. పెట్రింజా టౌన్‌లో 12 ఏళ్ల బాలిక చనిపోయింది. చుట్టుపక్కల గ్రామాల్లో మరో నలుగురు మృత్యువాతపడ్డారు.



    పెట్రింజాలో చాలా చోట్ల భవనాలు కూలిపోయాయి. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఆర్మీ కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంది. భూకంపంతో మా పట్ణణం పూర్తిగా ధ్వంసమయిందని పెట్రింజా మేయర్ డారింకో డంబోవిక్ తెలిపారు. ఇది హిరోషిమాలా ఉందని.. సగం పట్టణమంతా నాశనమయిందని వెల్లడించారు. ఇది చాలా భయానకంగా ఉందని.. యుద్ధం కంటే తీవ్రంగా ఉందని పెట్రింజాకు చెరందిన ఓ వ్యక్తి చెప్పారు.

    భూకంప భయంతో జాగ్రెబ్ ప్రజలు వణికిపోయారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. క్రోయేషియా చుట్టుపక్కల దేశాలైన సెర్బియా, బోస్నియా, స్లోవేనియా, ఆస్ట్రియాలోనూ భూప్రకంపనలు సంభవించాయి. భూంకంపతో క్రస్కో న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను మూసివేశారు. ఈ పవర్ ప్లాంట్‌ను క్రోయేషియా, స్లోవేనియా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published: