హోమ్ /వార్తలు /international /

MP Wedding : 49 ఏళ్ల ఎంపీకి..18 ఏళ్ల యువతితో మూడో పెళ్లి

MP Wedding : 49 ఏళ్ల ఎంపీకి..18 ఏళ్ల యువతితో మూడో పెళ్లి

Pak MP Mariiage:  పాకిస్తాన్ అధికార పార్టీ "పీటీఐ" ఎంపీ అమీర్ లియాఖత్ హుస్సేన్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. 49 ఏళ్ల వయసున్న ఎంపీ అమీర్ లియాఖత్ హుస్సేన్

    Pak MP Mariiage:  పాకిస్తాన్ అధికార పార్టీ "పీటీఐ" ఎంపీ అమీర్ లియాఖత్ హుస్సేన్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. 49 ఏళ్ల వయసున్న ఎంపీ అమీర్ లియాఖత్ హుస్సేన్..., రెండో భార్య, పాక్‌ నటీ తుబా అమీర్‌ నుంచి విడాకులు పొందిన బుధవారం రోజునే 18 ఏళ్ల సయేదా దానియా షా అనే యువతిని వివాహమాడారు. ఈ విషయాన్ని ఎంపీ ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా గురువారం వెల్లడించారు. గత రాత్రి 18 ఏండ్ల సయేదా దానియా షాను పెళ్లి చేసుకున్నా. ఆమె దక్షిణ పంజాబ్‌ లోధ్రాన్‌ లోని గౌరవనీయమైన నజీబ్ ఉత్ టార్ఫైన్ "సాదాత్" కుటుంబానికి చెందిన యువతి. చాలా అందంగా, మనోహరంగా, సరళంగా, ప్రియంగా ఉంటుంది. మా జంటను ఆశీర్వదించండి. దయ చేసి మా కోసం ప్రార్థించండి. నేను ఇప్పుడే చీకటి గుహ నుంచి బయటపడ్డాను. నా గత జీవితం రాంగ్ టర్న్" అని ఇన్‌ స్టాగ్రామ్‌ ఎంపీ రాసుకొచ్చారు.

    పెళ్లి తర్వాత మూడో భార్యతో కలిసి ఒక టీవీకి ఎంపీ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అయితే అమీర్ లియాఖత్ మూడో పెళ్లి పాక్‌ నెటిజన్లు సోషల్‌ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు. వారిద్దరి మధ్య 31 ఏళ్ల వయసు తేడా ఉండటంతో పలు రకాల మీమ్స్‌ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అమీర్‌ లియాఖత్‌ 18 ఏళ్ల క్రితమే తన భార్యను ఎత్తుకున్నారంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.

    ALSO READ Viral Video : వివాహేతర సంబంధం..భర్య తల నరికి,చేత్తో పట్టుకొని వీధుల్లో తిరుగుతూ

    మరోవైపు, చిన్నప్పుడే అమీర్‌ లియాఖత్‌ తో ప్రేమలో పడినట్లు కొత్త భార్య సయేదా దానియా షా తెలిపింది. ఆయనను టీవీలో చూసి ఇష్టపడినట్లు తెలిపింది. తాను ఎప్పుడు ఏడ్చినా, తన తల్లిదండ్రులు అమీర్ లియాఖత్‌ ను టీవీలో చూపేవారని పేర్కొంది. తమ పెండ్లిని తాను ఇంకా నమ్మలేకపోతున్నానని చెప్పింది.

    First published:

    ఉత్తమ కథలు