400 ఏళ్ల అరుదైన చెట్టు చోరీ...రూ.84 లక్షల నష్టం..దొంగల కోసం వేట

అరుదైన షింపకు వృక్షాన్ని శతాబ్ధాల క్రితం ఓ పర్వతం నుంచి తీసుకొచ్చారని...క్రమక్రమంగా అది కుచించుకుపోయి చిన్నగా మారిపోయిందని ఇమురా దంపతులు వెల్లడించారు. మా సొంత పిల్లల్లాగా దాన్ని పెంచుకున్నామని..తమ శరీర భాగాలు తెగిపోయినంతా బాధగా ఉందని కన్నీటి పర్యంతమయ్యారు.

news18-telugu
Updated: February 12, 2019, 8:28 PM IST
400 ఏళ్ల అరుదైన చెట్టు చోరీ...రూ.84 లక్షల నష్టం..దొంగల కోసం వేట
చోరీకి గురైన షింపకు బొన్సాయ్ ట్రీ
news18-telugu
Updated: February 12, 2019, 8:28 PM IST
దొంగలు డబ్బులను దొంగిలిస్తారు..! లేదంటే విలువైన ఆభరణాలు, వస్తువులను ఎత్తుకెళ్తారు..! కానీ జపాన్‌లో వెరైటీ చోరీ జరిగింది. భార్యాభర్తలు కలిసి కలిసి ఓ చెట్టును చోరీచేశారు. చెట్టును ఎత్తుకెళ్లడమేంటి..? అదెలా సాధ్యం? వినడానికి విడ్డూరంగా ఉంది కదూ..! ఐతే అది భారీ వృక్షం కాదు..అలాగని చిన్నమొక్క కాదు..! బొన్సాయ్ ట్రీ..! ఆ చెట్టును దొంగిలిస్తే వారికేం లాభం?  అందరిలోనూ ఈ డౌట్ రావడం కామన్..! కానీ అది సాదా సీదా చెట్టు కాదు..400 ఏళ్ల నాటి అరుదైన వృక్షం. దాని విలువెంతో తెలుసా రూ. 84 లక్షలు..! నమ్మేలా లేకున్నా ఇది నిజం..!

జపాన్‌కు చెందిన ఫుయుమి ఇమురా, సీజి ఇమురా దంపతులు..టోక్యోలో బొన్సారీ నర్సరీ నిర్వహిస్తున్నారు. 5వేల హెక్టార్ల ఆ బొన్సాయ్ పార్క్‌లో సుమారు 3వేల మొక్కలున్నాయి. వాటిలో ఎన్నో అరుదైన బొన్సాయ్ జాతులున్నాయి. 'షింపకు' అనే 400 ఏళ్ల వయసున్న బొన్సాయ్ వృక్షం నర్సరీకే ప్రత్యేక ఆకర్షణ. ఇక ఈ నెలలో టోక్యోలో జరగనున్న బ్యూటీ కాంటెస్ట్‌లో షింపకును ప్రదర్శించాల్సి ఉంది. వేలంలో భారీ మొత్తానికి అమ్ముడవుతుందని అంచనాలున్నాయి. కానీ అంతలోనే దారుణం జరిగింది. గత నెలలో బొన్సాయ్ పార్క్‌లోకి చొరబడిన దొంగలు షింపకుతో పాటు మరో ఆరు చెట్లను చోరీ చేశారు. బొన్సాయ్ పార్క్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం రెండు వారాలుగా గాలిస్తున్నారు.

ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న షింపకు చోరీ కావడంతో ఇమురా దంపతులు కన్నీంటి పర్యంతమయ్యారు. మా సొంత పిల్లల్లాగా దాన్ని పెంచుకున్నామని..తమ శరీర భాగాలు తెగిపోయినంతా బాధగా ఉందని రోదిస్తున్నారు.
ఆ బుల్లి వృక్షాలను కన్న పిల్లాల్లాగా చూసుకున్నాం. మేం ఎంత బాధపడుతున్నామో మాటల్లో చెప్పలేం. మా శరీర భాగాలు తెగిపోయిట్లుగా ఉంది. మా షింపకు చెట్టు 400 ఏళ్లుగా జీవిస్తోంది. నీళ్లు లేకుంటే వారం కంటే ఎక్కువ రోజులు బతకదు. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారో లేదో..? మనం చనిపోయినా ఆ చెట్టు మాత్రం ఎప్పటికీ జీవిస్తుంది.
ఫుయుమి ఇమురా


400 ఏళ్ల షింపకుతో పాటు మూడు జయోమాటస్, తక్కువ విలువ కలిగిన మరో మూడు షింపకు మొక్కలు కూడా చోరీకి గురైనట్లుగా ఫుయుమి చెప్పారు. అరుదైన షింపకు వృక్షాన్ని శతాబ్ధాల క్రితం ఓ పర్వతం నుంచి తీసుకొచ్చారని...క్రమక్రమంగా అది కుచించుకుపోయి చిన్నగా మారిపోయిందని వెల్లడించారు. ప్రస్తుతం ఆ చెట్టు మీటర్ పొడవు, 70 సెంటీ మీటర్ల వెడల్పు ఉందని తెలిపారు.


First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...