హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Shooting: ఇంట్లో జోరుగా పార్టీ.. తుపాకులతో అంబుష్ దాడి.. నలుగురు మృతి -అమెరికాలో మరో ఘోరం

Shooting: ఇంట్లో జోరుగా పార్టీ.. తుపాకులతో అంబుష్ దాడి.. నలుగురు మృతి -అమెరికాలో మరో ఘోరం

లాస్ ఏంజెల్స్ సమీప ఇంగ్లీవుడ్ లో కాల్పుల ఉదంతం

లాస్ ఏంజెల్స్ సమీప ఇంగ్లీవుడ్ లో కాల్పుల ఉదంతం

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకి మోత దద్దరిల్లింది. కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏజెల్స్ కు సమీపంలో ఓ ఇంటిపై అనుమానిత అంబుష్ దాడి జరిగింది. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరొకరు ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్నాడు..

ఇంకా చదవండి ...

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకి సంస్కృతి వర్ధిల్లింది. కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏజెల్స్ కు సమీపంలో ఓ ఇంటిపై అనుమానిత అంబుష్ దాడి జరిగింది. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరొకరు ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్నాడు. స్థానిక పోలీసులు, మీడియా వెల్లడించిన వివరాలివి..

లాస్ ఏంజెల్స్ సిటీకి 10మైళ్ల దూరంలోని ఇంగ్లీవుడ్ సిటీలో భయానక కాల్పుల ఉదంతం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున లాస్ ఏంజెల్స్ సమీపంలో ఒక హౌస్ పార్టీలో షూటర్లు కాల్పులు జరపడంతో నలుగురు వ్యక్తులు మరణించారరని, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. నిందితులు రైఫిల్స్, హ్యాండ్ గన్స్ తో విధ్వంసం సృష్టించారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.

Parosmia : మీ పిల్లలు సరిగా తినడంలేదా?.. Post Covid లక్షణం పారోస్మియా కావొచ్చు..ఏం చేయాలంటే..


ఇంగ్లీవుడ్ నగరంలోని ఒక ఇంటిపై కాల్పులు జరిగాయన్న సమాచారం తెల్లవారుజామున 1:30 గంటలకు పోలీసులకు అందిందని, వెంటనే పోలీసులు స్పందించారని మేయర్ జేమ్స్ బట్స్ విలేకరులతో అన్నారు. ఇంగ్లీవుడ్ కాల్పుల ఘటనలో చనిపోయినవారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులున్నారని అధికారులు చెప్పారు.

Lockdown : ఏపీలో కరోనా ఒమిక్రాన్ విలయం.. లాక్‌డౌన్ విధింపు దిశగా YS Jagan సర్కార్?


లాస్ ఏంజెల్స్ సమీపంలోని ఇంగ్లీవుడ్ లో ఇంటి పార్టీపై ఇలా ఆకస్మిక దాడి జరగడం 1990ల తర్వాత ఇదే తొలిసారి అని, ఘటనకు దారి తీసిన కారణాలు, నిందితుల వివరాలను కనిపెడతామని పోలీస్ అధికారులు చెప్పారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Published by:Madhu Kota
First published:

Tags: Shooting, Us shooting

ఉత్తమ కథలు