ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచీ బయలుదేరిన వెంటనే కూలిపోయిన ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ విమాన ప్రమాదంలో మొత్తం 157 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందీ చనిపోయారు. వారిలో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. మొత్తం 35 దేశాలకు సంబంధించిన ప్రయాణికులంతా చనిపోవడం అత్యంత విషాదకరం. 2018 అక్టోబర్‌లో ఇండొనేసియాలో లయన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఇలాంటి బోయింగ్ మోడల్ విమానమే కూలిపోయింది. కెన్యా రాజధాని నైరోబీకి వెళ్లాల్సిన ఇథియోపియా విమానం... టేకాఫ్ అయిన ఆరు నిమిషాలకే కూలిపోయింది. బోయింగ్ తయారు చేసిన 737 మాక్స్ 8 మోడలైన ఆ విమానం కొన్ని నెలల కిందటే సేవలు ప్రారంభించింది.
విమాన మృతుల్లో నలుగురు భారతీయులు ఉన్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ధృవీకరించారు. వైద్య పన్నగేశ్ భాస్కర్, వైద్య హన్సిన్ అన్నగేశ్, నూకవరపు మనీష, శిఖా గార్గ్ అని సుష్మా స్వరాజ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు తగిన సాయం, మద్దతు అందించాలని ఇథియోపియాలోని భారత హై కమిషనర్‌ను కోరినట్లు ఆమె ట్విటర్‌లో తెలిపారు.
Pls help me reach their families. @IndiaInEthiopia https://t.co/fl3H0ZbodZ
— Sushma Swaraj (@SushmaSwaraj) March 10, 2019
మృతుల్లో ఒకరైన శిఖా గార్గ్ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు సలహాదారుగా పనిచేస్తున్నారు. ఆమె నైరోబీలో జరగాల్సిన ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సు ఫోర్త్ సెషన్‌కు వెళ్లాల్సి ఉంది. అంతలోనే ప్రమాదంలో చనిపోయారని సుష్మా స్వరాజ్ ప్రకటించారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ శిఖ గార్గ్ మృతి దురదృష్టకరమని, ఆమెతో పాటు ఇతర ప్రయాణీకుల మృతికి తన సంతాపం ప్రకటించారు.
My colleague Dr.Harshvardhan has confirmed that Ms.Shikha Garg is a Consultant with Ministry of Environment and Forests. She was travelling to attend UNEP meeting in Nairobi. I am trying to reach the families of other Indian nationals. PL RT and help. @IndiaInEthiopia /3
— Sushma Swaraj (@SushmaSwaraj) March 10, 2019
విమాన ప్రమాదానికి కారణాలు తెలియలేదు. దీనిపై ఇథియోపియా ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. విమానం బయలుదేరగానే కొన్ని ఇబ్బందులు తలెత్తాయని పైలట్ చెప్పగా, విమానాన్ని తిరిగి అడిస్ అబాబాకు మళ్లించాలని కోరినట్లు ఇథియోపియా ఎయిర్‌లైన్స్ తెలిపింది. అంతలోనే ప్రమాదం జరిగిపోయింది. భూమిపై కూలగానే మంటలు చెలరేగడం వల్ల ప్రయాణికులంతా చనిపోయారని తెలిపింది.
ఇవి కూడా చదవండి :
పశ్చిమాన మొదలై తూర్పున ముగిసే పోలింగ్ దశలు... ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి కలిసొస్తాయా?
ఈసారి ఎన్నికల్లో కొత్తదనం ఏముంది? కొత్తగా ఏ రూల్స్ తెచ్చారు?
టీడీపీ - వైసీపీ ... ఏ పార్టీ పథకాలు గొప్పవి ... విజయం ఎవరిది?
Lok Sabha Election 2019: ఓటరు జాబితాలో మీ పేరు ఉందా... లేదా? 3 నిమిషాల్లో తెలుసుకోండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Plane Crash, World