Home /News /international /

4 ASIATIC LIONS AT SINGAPORE ZOO TEST COVID POSITIVE CASES ALSO INCREASED MKS

మళ్లీ Covid విజృంభణ -నాలుగు సింహాలకు కరోనా పాజిటివ్ -Singapore Zooలో కలకలం

నాలుగు సింహాలకు కొవిడ్ పాజిటివ్

నాలుగు సింహాలకు కొవిడ్ పాజిటివ్

సింగపూర్‌ లో పర్యాటక ఆకర్షణ అయిన నైట్‌ సఫారీ జూపార్కులో నాలుగు ఆసియా సింహాలకు కరోనా పాజిటివ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. జూ సిబ్బందిలో ముగ్గురికి కూడా వైరస్ సోకింది. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే ఏకంగా 3,397 కొత్త కేసులు, 12 మరణాలు నమోదయ్యాయి..

ఇంకా చదవండి ...
ఇక తగ్గిందనుకున్న ప్రతిసారి మళ్లీ మళ్లీ విజృంభిచడమే తన స్టైలని కరోనా మహమ్మారి మళ్లీ రుజువుచేసుకుంది. చాలా రోజుల తర్వాత తిరిగి జంతువులకూ వైరస్ సోకుతున్నది. ఆసియా దేశం సింగపూర్ లో ఇటీవల కొవిడ్ ఉధృతి పెరగ్గా, ప్రఖ్యాత జూపార్కులో నాలుగు సింహాలు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. కొన్నాళ్లుగా మర్చిపోయిన కొవిడ్ నిబంధనలను మళ్లీ కఠినంగా అమలులోకి తీసుకొస్తున్నారు. వివరాలివి...

సింగపూర్‌ లో పర్యాటక ఆకర్షణ అయిన నైట్‌ సఫారీ జూపార్కులో నాలుగు ఆసియా సింహాలకు కరోనా పాజిటివ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. వైల్డ్‌లైఫ్‌ గ్రూప్‌లోని పరిరక్షణ, పరిశోధన, వెటర్నరీ వైస్‌ ప్రెసిడెంట్‌, జూ ఆపరేటర్‌ డాక్టర్‌ సోంజా లూజ్‌ ఈ మేరకు మీడియాకు వివరాలు అందించారు. మామూలుగానైతే వైరస్ లు జంతువకులకు పెద్దగా హాని చేయలేవని, సరైన చికిత్సతో అవి పూర్తిగా కోలుకుంటాయని డాక్టర్లు చెప్పారు.

సింహాలకు సోకింది కరోనా కాబట్టి అవసరమైతేనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీలు, యాంటీబయాటిక్స్‌ ఇస్తామని, సింహాల్లో గత రెండు రోజులుగా దగ్గు, తుమ్ములు, నీరసంతో పాటు తేలికపాటి లక్షణాలు కనిపించాయని జూ డాక్టర్లు చెప్పారు. నైట్‌ సఫారీ జూపార్క్ సిబ్బందిలో ముగ్గురికి కూడా కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో మొత్తం జూను మూసేశామని అధికారులు చెప్పారు.

సింగపూర్ లో నిన్న ఒక్కరోజే ఏకంగా 3,397 కొత్త కేసులు, 12 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 2,24,200కు పెరిగాయని, మొత్తం మరణాల సంఖ్య 523కు చేరిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇటీవల దేశంలో కొవిడ్ కొత్త కేసులు పెరుగుతుండటం, ఇప్పుడు సింహాలకు కూడా వైరస్ సోకడంతో అవసరమైన కట్టడిచర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు.
Published by:Madhu Kota
First published:

Tags: Coronavirus, Covid, Covid cases, Lions, Singapore

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు