Home /News /international /

38 PRISONERS WERE BURNED ALIVE IN A FIRE ACCIDENT AT GITEGA PRISON IN BURUNDI AND ANOTHER 69 PRISONERS WERE REPORTED SERIOUSLY INJURED PRV

Burundi prison fire: జైలులో అగ్నిప్రమాదం.. 38 మంది ఖైదీలు సజీవ దహనం.. ఘటనకు కారణాలు వెల్లడించని ప్రభుత్వం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గితేగా జైలులో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదం (Fire Accident)లో 38 మంది ఖైదీలు (Prisoners) మరణించారు. మరో 69మంది ఖైదీలు (Prisoners) తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది.

ఇండోనేషియాలోని బాంటెన్ ప్రావిన్స్‌లో ఉన్న జైలులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో జైలులో విధులు నిర్వహిస్తున్న అధికారులతో సహా మొత్తం 40 మందికి పైగా అగ్నికి ఆహుతి కావడం తెలిసిందే. ఈ ఘటన మర్చిపోకముందే తూర్పు ఆఫ్రికా దేశమైన బురుండి (Burundi)లో దారుణం జరిగింది. ఆ దేశ రాజధాని గితెగా (Gitega)లోని ప్రధాన జైలులో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదం (Fire Accident)లో కనీసం 38 మంది ఖైదీలు (Prisoners) మరణించారు. మరో 69మంది ఖైదీలు (Prisoners) తీవ్రంగా గాయపడినట్లు ఆ దేశ ఉపాధ్యక్షుడు ప్రోస్పర్ బజోంబాంజా (Prosper Bazombanza) వెల్లడించారు. ఖైదీలందరు నిద్రపోతున్న సమయంలో తెల్లవారుజామున 4:00 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. జైలు నుంచి బయటకు వెళ్లలేని ఖైదీలు సజీవ దహనమయ్యారని (Prisoners were burned alive) వైస్ ప్రెసిడెంట్ వెల్లడించారు. ఈ ప్రమాదానికి (Burundi prison fire) కారణమేంటో చెప్పలేదు. మరణించిన వారిలో చాలా మంది వృద్ధ ఖైదీలు ఉన్నట్లు సమాచారం. బురుండి క్రిస్టియన్ అసోసియేషన్ (Burundi Christian Association) ప్రకారం, 400 మంది ఖైదీల సామర్థ్యం కలిగిన గితెగా జైలులో గత నెల నాటికి 1,539 మంది ఖైదీలను ఉంచారని ఆరోపించారు. మరోవైపు, బురుండి అంతర్గత మంత్రిత్వ శాఖ పోస్ట్ చేసిన ట్వీట్‌లో అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ (Short circuit) కారణమని పేర్కొంది.

ఆర్మీ పికప్ ట్రక్కులలో ఆసుపత్రికి

కాగా, ఈ ఘటన (Burundi prison fire)కు సంబంధించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు మిలటరీ సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు.. ఆర్మీ పికప్ ట్రక్కులలో ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ సంఘటనపై అధికారులెవరు వ్యాఖ్యానించేందుకు నిరాకరించారని స్థానిక మీడియా తెలిపింది.

సజీవ దహనం అవుతున్నామని ..

“మంటలు చాలా ఎక్కువగా ఎగసిపడటం చూశామని, సజీవ దహనం అవుతున్నామని అరవడం ప్రారంభించాము, కాని పోలీసులు మా క్వార్టర్స్ తలుపులు తెరవడానికి నిరాకరించారని ప్రత్యక్ష సాక్షి అయిన ఖైదీ ఒకరు చెప్పారు. “నేను ఎలాగో తప్పించుకున్నాను , కానీ పూర్తిగా కాలిపోయిన ఖైదీలు ఉన్నారు.” అని చెప్పుకొచ్చారు.



అధికారుల నిర్లక్ష్యం.!

అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎక్కువ మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, బురుండిలోని రెడ్‌క్రాస్ (Red Cross) బృందాలు బాధితులను ఆదుకునేందుకు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, స్వల్పంగా ఉన్న మరికొందరికి చికిత్స అందిస్తున్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Fire Accident, Jails

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు