360 VIDEO FROM THE NEW YORK TIMES TO FIND SILENT PLACE ON EARTH NK
ప్రపంచంలో అత్యంత సైలెంట్ ప్లేస్ ఏది?... వైరల్ వీడియో
ప్రపంచంలో అత్యంత సైలెంట్ ప్లేస్ ఏది?... వైరల్ వీడియో
Finding Silence in a Noisy World : న్యూయార్క్ టైమ్స్ రిలీజ్ చేసిన ఆ 360 డిగ్రీ వీడియో... అందర్నీ కట్టిపడేస్తోంది. అందులో దృశ్యాలు చూపు తిప్పుకోనివ్వట్లేదు.
తెల్లారి లేచింది మొదలు... రాత్రి పడుకునే వరకూ మనం రకరకాల శబ్దాలు వింటూనే ఉంటాం. ఒక్కోసారి... బాబోయ్... ఈ సౌండ్లేంటి... అని చిరాకుపడతాం. సౌండ్ పొల్యూషన్ ప్రపంచమంతా విస్తరించింది. మరి ధ్వని కాలుష్యం లేని ప్రదేశం అంటూ ఉందా? ఉంటే అది ఎక్కడ ఉంది? అన్న ప్రశ్నకు సమాధానం దొరికింది. వాషింగ్టన్‌లోని ది హో రెయిన్ ఫారెస్ట్ (The Hoh Rain Forest) అత్యంత ప్రశాంతంగా, ధ్వని కాలుష్యం లేని ప్రదేశంగా తేల్చారు డైరెక్టర్లు ఆడమ్ లాఫ్టెన్, ఇమాన్యూయెల్ వాఘాన్ లీ. వీళ్లిద్దరూ కలిసి... ఎకోస్టిక్ ఎకోలోజిస్ట్ (ధ్వనులను గుర్తించే నిపుణుడు) గార్డన్ హెమ్టన్తో కలిసి... వేర్వేరు ప్రదేశాల్లో ధ్వని కాలుష్యం ఎలా ఉందో తెలుసుకున్నారు. ఆ ప్రదేశాల్ని 360 డిగ్రీస్‌లో షూట్ చేశారు.
చాలా ప్రదేశాల్లో తిరిగిన ఆ టీమ్‌కి... ఎక్కడా సైలెంట్‌గా అనిపించలేదు. చివరకు ది హో రెయిన్ ఫారెస్ట్‌లో మాత్రం పక్షుల కిలకిలారావాలు వినిపించాయి. అక్కడ మనం రోజువారీ వినే శబ్దాల గోల లేదు. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ ప్రదేశంలో అసలైన వినాల్సిన శబ్దాలు వినపడుతున్నాయని ఆ టీమ్ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.