Iran rise in prices of staple foods రష్యా-ఉక్రెయిన్ మధ్య రెండు నెలలకు పైగా కొనసాగుతున్న యుద్ధం పరిణామాలు ప్రపంచదేశాలను కలవరపెడుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇప్పటికే మన దేశంలో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. అయితే తాజాగా మరో దేశానికి కూడా ఉక్రెయిన్ సెగ తగిలింది. ఇప్పటికే పశ్చిమ దేశాల ఆంక్షలతో విలవిల్లాడుతున్న ఇరాన్.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కరవు కారణంగా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇరాన్...నిత్యావసరాల కోసం రష్యా, ఉక్రెయిన్‌పై ఆధారపడుతుంది. అయితే యుద్ధం కారణంగా సరఫరా నిలిచిపోయి.. ఇరాన్ ప్రజల నెత్తిన ధరల పిడుగు పడింది. వంట నూనె, పాలు, గుడ్లు, చికెన్ వంటి నిత్యావసరాల ధరల్ని ఒక్కసారిగా 300 శాతం పెంచుతూ బుధవారం ఇరాన్ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ధరల పెంపుపై ప్రభుత్వ ప్రకటన వెలువడగానే ప్రజలు సూపర్ మార్కెట్లకు పరుగులు తీశారు. అర్ధరాత్రి వరకు స్టోర్ల బయట రోడ్లపై బారులు తీరారు. కొత్త ధరలు అమల్లోకి రాకముందే వీలైనన్ని సరకులు కొనేందుకు పోటీపడ్డారు.
రు. ధరల పెంపు ప్రజల్ని తీవ్ర అసహనానికి గురిచేసింది. అనేక మంది సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు. మరికొందరు వీధుల్లోకి వచ్చొ నిరసనలు తెలుపుతున్నారు. ఇరాన్‌లోని రెండు దక్షిణాది నగరాల్లో రాయితీతో కూడిన ప్రధాన ఆహార పదార్థాల ధరలను ఆకస్మికంగా పెంచడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన కనీసం 22 మందిని ఇరాన్ అధికారులు అరెస్టు చేసినట్లు ఆ దేశ అధికార మీడియా శుక్రవారం తెలిపింది. ఖుజెస్తాన్ ప్రావిన్స్ లోని డెజ్‌ఫుల్ సిటీలో రాత్రిపూట 15 మందిని, అలాగే కోహ్గిలుయే-బోయెరహ్మద్ ప్రావిన్స్ లోని యసుజ్ నగరంలో మరో ఏడుగురిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని IRNA వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లోని మరో నగరంలో 200 మంది గుమిగూడారని, అక్కడ నిరసనకారులు పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బందిపై రాళ్లు రువ్వడంతో ఒక అగ్నిమాపక సిబ్బంది గాయపడినట్లు తెలిపింది.
ALSO READ Intresting : నా చిలుక మోసం చేసింది..పోలీస్ స్టేషన్ లో వ్యక్తి ఫిర్యాదు..రంగంలోకి దిగిన పోలీసులు
శుక్రవారం నాటికి అన్ని ప్రాంతాలలో పరిస్థితి శాంతించినట్లు IRNA తెలిపింది., అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ..రాజధాని టెహ్రాన్ సూపర్ మార్కెట్‌లలో దుకాణదారులను వారి సమస్యలను వినడానికి కలుసుకున్న చిత్రాలను IRNA విడుదల చేసింది. ఇక,ధరల పెంపుపై ప్రజాగ్రహం నిరసనలుగా మారి, దేశంలో అనిశ్చితికి దారితీసే ప్రమాదముందని హక్కుల పరిరక్షణ ఉద్యమకారులు చెబుతున్నారు. అందుకే ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కొన్నిచోట్ల ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిందని తెలిపారు.
ఇరాన్ తన వంట నూనెలో సగం ఉక్రెయిన్ నుండి దిగుమతి చేసుకుంటుంది, దాదాపు సగం గోధుమలను రష్యా నుండి దిగుమతి చేసుకుంటోంది. పొరుగున ఉన్న ఇరాక్ మరియు ఆఫ్ఘానిస్తాన్‌లకు ఇరాన్ యొక్క అధిక సబ్సిడీ బ్రెడ్ అక్రమ రవాణా.. ఇరాన్ అంతటా ఆకలి ఆకలి కేకలు పెరిగినట్లు సమాచారం.
ALSO READ Wonder : ఆశ్చర్యపోతున్న సైంటిస్టులు..ఫసిఫిక్ సముద్ర గర్భంలో పసుపు ఇటుకల రోడ్డు
కరువు ఇప్పటికే ఇరాన్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోంది మరియు ఇరాన్ యొక్క అణు కార్యక్రమంపై పాశ్చాత్య ఆంక్షలు అదనపు ఇబ్బందులను కలిగించాయి. ఇరాన్ లో ద్రవ్యోల్బణం దాదాపు 40 శాతానికి ఎగబాకింది, ఇది 1994 నుండి అత్యధిక స్థాయి. యువత నిరుద్యోగం కూడా ఎక్కువగానే ఉంది. ఇరాన్ గణాంకాల కేంద్రం ప్రకారం ఇరాన్ కుటుంబాల్లో దాదాపు 30 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు.
నవంబర్ 2019లో ఇరాన్ లో ఇంధన ధరల పెంపు కారణంగా జరిగిన పరిణామాలు ఇప్పటికీ అందరికి గుర్తు ఉన్నాయి. అప్పుడు, విస్తృతమైన నిరసనలు 1979లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడినప్పటి నుండి అత్యంత హింసాత్మకమైనవి,దేశాన్ని కదిలించిన విషయం అందరికీ తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Food prices, Iran