విమానంలో గొడవ... 30 మందికి గాయాలు... అసలేం జరిగిందంటే...

Turkish Airlines Flight : టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానంలో జరిగిన ఘర్షణ తీవ్ర కలకలం రేపింది.

Krishna Kumar N | news18-telugu
Updated: March 10, 2019, 2:45 PM IST
విమానంలో గొడవ... 30 మందికి గాయాలు... అసలేం జరిగిందంటే...
గాయపడిన ప్రయాణికులు (Image : AP)
Krishna Kumar N | news18-telugu
Updated: March 10, 2019, 2:45 PM IST
టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు బయలుదేరింది టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానం. అందులో 326 మంది ప్రయాణికులున్నారు. విమానం ఎక్కేటప్పుడు ఎలాంటి సమస్యా రాలేదు. ఇంకో 45 నిమిషాల్లో ఫ్లైట్ న్యూయార్క్‌లో ల్యాండ్ అవుతుందనగా... ఉన్నట్టుండి గొడవ మొదలైంది. ప్రయాణికులు రెండు గ్రూపులుగా విడిపోయారు. మొదట తిట్టుకున్నారు. కాసేపటికే... కొట్టుకునే పరిస్థితి వచ్చేసింది. ఆ టైంలో విమానం అట్లాంటిక్ సముద్రం పైనుంచీ వెళ్తోంది. నిజానికి ఆ టైంలో ప్రయాణికులు ఎంతో ఒద్దికగా... ప్రశాంతంగా ఉండాలి. అలాంటిది ఆ విమానంలో మాత్రం దాదాపు యుద్ధం జరిగింది. ఎవరికి వాళ్లు ఎదుటివాళ్లపై విరుచుకుపడ్డారు. పిడి గుద్దులు గుద్దుకున్నారు. ఫ్లైట్ మొత్తం ఇదే పరిస్థితి. ఎవర్నీ ఎవరూ కంట్రోల్ చేయలేని స్థితి. ఫ్లైట్ సిబ్బంది చేతులెత్తేశారు. ఎప్పుడు ఏమవుతుందోనన్న టెన్షన్ పెరిగిపోయింది. ఒకటే అరుపులతో విమానం దద్దరిల్లింది.

విమానాన్ని పైలట్ న్యూయార్క్‌లోని కెన్నడీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. అప్పటికే విమానంలో జరిగిన గొడవ వల్ల 30 మందికి గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఓ ఫ్లైట్ అటెండెంట్‌కి కాలు విరిగిపోయింది. అధికారులు వాళ్లను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి ట్రీట్‌మెంట్ చేశారు.

ఈ ఘటన కలకలం రేపుతుండగానే... ఇథియోపియాలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. అడిస్ అబాబా నుంచి నైరోబీకి వెళ్తున్న విమానం కుప్పకూలినట్టు ఆ సంస్థ అధికార ప్రతినిధి రాయిటర్స్ వార్తాసంస్థకు తెలిపారు. ఆ విమానంలో 157 మంది ప్రయాణిస్తున్నారు. 149 మంది ప్రయాణికులు ఎనిమిది మంది సిబ్బంది ఉన్నట్టు తెలిసింది.

 ఇవి కూడా చదవండి :

#BoycottSurfExcel ... ట్విట్టర్‌లో ఎందుకీ హ్యాష్ ట్యాగ్... అసలేం జరిగింది?

Emergency Numbers : ఈ అత్యవసర నెంబర్లు... మీ దగ్గర ఉన్నాయా?
Loading...
ఏప్రిల్ 2 నుంచీ గూగుల్ ప్లస్ లేనట్లే... ఆ తర్వాత ఏం జరుగుతుందంటే...

లోక్‌సభ ఎన్నికలకు ఈసీ సిద్ధం... ఇవాళ సాయంత్రమే నోటిఫికేషన్
First published: March 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...