బార్‌కి వెళ్లి పాలు అడిగింది...సోషల్ మీడియాలో వీడియో వైరల్

తన ఆకలిని తానే తీర్చుకోవాలని భావించిన మైలా..పూల్ సమీపంలో ఉన్న బార్ దగ్గరికి వెళ్లింది. మిల్క్ బాటిల్ ఇవ్వాలని సర్వన్‌ని కోరింది. అవి ఇక్కడ ఉండవని అతడు చెప్పడంతో..కనీసం గ్లాస్ పాలైనా ఇవ్వండని కోరింది.

news18-telugu
Updated: September 5, 2019, 11:01 PM IST
బార్‌కి వెళ్లి పాలు అడిగింది...సోషల్ మీడియాలో వీడియో వైరల్
బార్‌లో కూర్చున్న మైలా
  • Share this:
బార్‌కి వెళ్లి బీర్ అడిగితే ఒకే. .!  అదే బార్‌కి ఒక్కడే వెళ్లి కూల్ డ్రింక్ ఆర్డర్ చేస్తే.. 'వీడెవడ్రా' అనుకుంటారు సర్వర్స్. కానీ బార్‌కి వెళ్లి పాలు అడిగితే ... అక్కడున్న  వాళ్లు షాక్ అవడమే కాదు.. పగలబడి నవ్వుతారు. క్రోయేషియాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఐతే బార్‌కెళ్లి పాలడిగింది...18 ఏళ్లు నిండిన ఏ యువతో.. యువకుడో కాదు. మూడేళ్ల చిన్నారి..! తనకు బాగా ఆకలి వేయడంతో ఏం చేయాలో తెలియక.. పక్కనే ఉన్న బార్‌కి వెళ్లి 'వన్ గ్లాస్ మిల్క్' అని ఆర్డర్ ఇచ్చింది.

బెన్ ఆండర్స్-సూఫీ దంపతులు.. తమ 3 ఏళ్ల కూతురు మైలాతో కలిసి హాలీడే ట్రిప్ కోసం క్రోయేషియాలోని డబ్రోనిక్‌కి వెళ్లారు.  ఓ హోటల్‌లో దిగి చుట్టు పక్కల ప్రాంతాలను సందర్శించాలని ప్లాన్ చేసుకున్నారు. ఐతే మైలా తల్లిదండ్రులు స్విమ్మింగ్ పూల్‌లో దిగి స్నానం చేస్తుండగా ఆ చిన్నారికి బాగా ఆకలేసింది. తమ బ్యాగ్‌లో పాల సీసాలు కూడా లేవు.  తన ఆకలిని తానే తీర్చుకోవాలని భావించిన మైలా..పూల్ సమీపంలో ఉన్న బార్ దగ్గరికి వెళ్లింది. మిల్క్ బాటిల్ ఇవ్వాలని సర్వన్‌ని కోరింది. అవి ఇక్కడ ఉండవని అతడు చెప్పడంతో..కనీసం గ్లాస్ పాలైనా ఇవ్వండని కోరింది.

మైలా అమాయకత్వాన్ని చూసి బార్ సిబ్బంది నవ్వుకున్నారు. ఆ చిన్నారి వీడియోను బార్‌లో ఉన్న కొందరు రికార్డ్ చేశారు. ఆ వీడియోను మైలా తండ్రి బెన్ ఆండర్స్ ట్విటర్‌లో షేర్ చేశారు.


First published: September 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు