హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Video : టర్కీలో 24 గంటల్లో మూడోసారి భూకంపం..పేకమేడల్లా కూలిపోతున్న బిల్డింగ్ లు,మోదీ సాయం

Video : టర్కీలో 24 గంటల్లో మూడోసారి భూకంపం..పేకమేడల్లా కూలిపోతున్న బిల్డింగ్ లు,మోదీ సాయం

Earthquake in Turkey. Image source Twitter/SaqibIlyas12

Earthquake in Turkey. Image source Twitter/SaqibIlyas12

Turkey buildings collapse video : తుర్కియా(టర్కీ)లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. పెను భూకంపం టర్కీని కుదిపేసింది(Turkey earthquake). సోమవారం తెల్లవారుజాము 4:17 గంటల సమయంలో ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం సంభవించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Turkey buildings collapse video : తుర్కియా(టర్కీ)లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. పెను భూకంపం టర్కీని కుదిపేసింది(Turkey earthquake). సోమవారం తెల్లవారుజాము 4:17 గంటల సమయంలో ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం సంభవించింది. టర్కీకి ప్రధాన పారిశ్రామిక కేంద్రమైన గజియాన్టెస్, సిరియా సరిహద్దు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. దీంతో పలు భవనాలు కుప్పకూలాయి. ఆ తర్వాత ఇవాళ మధ్యాహ్నాం మరోసారి,సాయంత్రం మరోసారి టర్కీలో తీవ్ర భూకంపాలు సంభవించాయి. 24 గంటల్లో మూడు భూకంపాలతో టర్కీ వణికిపోయింది.

భూకంపం కారణంగా టర్కీ,సిరియా దేశాల్లో 1800మందికి పైగా మృతి చెందారు. సిరియాలోని తిరుగుబాటుదారులు మరియు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో కనీసం 783 మంది మరణించారని స్థానిక మీడియా, వైద్య వర్గాలు తెలిపాయి. టర్కీలో1121మంది మరణించారని సమాచారం. ఇంకా వేల మంది శిథిలాల కింద చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.

భారీ భూకంపం ధాటికి ద‌క్షిణ ట‌ర్కీలోని బిల్డింగ్‌లు కూలిపోతున్నాయి. బిల్డింగ్‌లు కూలుతున్న దృశ్యాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. భూకంపం కారణంగా ఇప్పటికే వేలాది మంది గాయాలపాలవగా..మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు మూడుకోట్ల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. ఇక, టర్కీ ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. 24 గంటల్లో మూడుసార్లు భూకంపం సంభవించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

భారీ భూకంపంతో టర్కీ అతలాకుతలమైన వేళ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే సహాయక, మెడికల్ బృందాలను టర్కీ పంపాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి మోదీ ఆదేశాలతో పీఎంఓలో ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేబినెట్ కార్యదర్శి, హోం మంత్రిత్వ శాఖ, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖ, ఆరోగ్యశాఖ, ఎన్డీఆర్ఎఫ్ విభాగంలోని ప్రతినిధులు హాజరయ్యారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికి తీయడంతో పాటు సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్డీఆర్ఎఫ్(NDRF) బృందాలను టర్కీ పంపించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే క్షతగాత్రులకు వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బందిని కూడా టర్కీ పంపిస్తున్నారు. గాయపడిన వారికి అవసరమైన ఔషధాలు, ఇతర సహాయక సామాగ్రి కూడా ఈ బృందాలు భారత్ నుంచి తీసుకెళ్తున్నాయి.

First published:

Tags: Earth quake, Earth Tremors, Earthquake, Turkey

ఉత్తమ కథలు