గన్ ఫైరింగ్‌లో ముగ్గురు మృతి... నెటిజన్ల ఫైర్...

గన్ ఫైరింగ్‌లో ముగ్గురు మృతి... నెటిజన్ల ఫైర్...

గన్ ఫైరింగ్ జరిగిన ప్రదేశం (credit - twitter - CNN Breaking News)

US Shooting at Walmart : అమెరికాలో గన్ కల్చర్ ఘటనలు ఎక్కువవుతున్నాయా? వాల్‌మార్ట్‌లో ఫైరింగ్ ఎందుకు జరిగింది?

 • Share this:
  US Shooting at Walmart : అత్యంత సంపన్న దేశమైన అమెరికాలో... ప్రజలకు రక్షణ లేకుండా పోతోందా? జరిగే ఘటనల్ని చూస్తే అవుననే అనిపించకమానదు. ఒక్లహోమాలోని డంకన్‌లో... వాల్‌మార్ట్ స్టోర్ దగ్గర జరిగిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారని తెలిసింది. పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం... చనిపోయిన ముగ్గురిలో కాల్పులు జరిపిన వ్యక్తి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అలర్టైన అధికారులు... స్థానిక స్కూళ్లను తాత్కాలికంగా మూసివేశారు. అంతా సవ్యంగా ఉంది అని పోలీసులు క్లారిటీ ఇచ్చిన తర్వాతే వాటిని తిరిగి తెరవాలని ఆదేశించారు. ఈ ఫైరింగ్ ఘటన వాల్‌మార్ట్ స్టోర్ బయట, లోపల కూడా తీవ్ర కలకలం రేపింది. చుట్టుపక్కల ప్రజలు తలో దిక్కుకూ పరుగులు తీశారు. ఫైరింగ్ ఎందుకు జరిపారో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


  ఈ ఘటనకు ముందురోజే... అంటే... సోమవారం కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి జరిపిన గన్ ఫైరింగ్‌లో నలుగురు చనిపోగా... ఆరుగురు గాయపడ్డారు. ఆగస్టులో... టెక్సాస్‌లోని ఎల్ పాసో దగ్గర ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 22 మంది చనిపోయారు. తరచూ జరుగుతున్న ఈ ఘటనలపై సోషల్ మీడియాలో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2018లో వచ్చిన దిసీజ్ అమెరికా సాంగ్‌లో చెప్పినట్లే జరుగుతోందని ఫైర్ అవుతున్నారు.

  దిసీజ్ అమెరికా సాంగ్... 2018లో యూట్యూబ్‌లో రిలీజైనప్పుడు చాలా మంది నేటివ్ అమెరికన్లు ఆ సాంగ్‌ని వ్యతిరేకించారు. అమెరికా పరువు తీసేందుకే ఈ సాంగ్ రూపొందించారని అన్నారు. కానీ... ప్రపంచ దేశాల ప్రజలు ఆ సాంగ్‌కు సపోర్ట్ ఇచ్చారు. అమెరికాలో గన్ కల్చర్ ఉందని సెటైరికల్‌గా ఆ సాంగ్‌లో చెప్పారని మద్దతిచ్చారు. ఏడాదిన్నర కాలంలో ఈ సాంగ్‌ను 61 కోట్ల మందికి పైగా చూడటం విశేషం.


  అందాల ముద్దుగుమ్మ రితికా సింగ్ స్టిల్స్  ఇవి కూడా చదవండి :

  Health : కూరగాయలు పచ్చివి తింటే ప్రమాదమా... ఆయుర్వేదం ఏం చెబుతోంది?

  అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్? నెక్ట్స్ ఏమవుతుంది?

  స్కూళ్లకు సెలవులు ఇవ్వండి... ప్రభుత్వానికి పేరెంట్స్ విజ్ఞప్తి

  డయాబెటిస్ కంట్రోల్ అయ్యేందుకు ఇంటి చిట్కాలు...

  Published by:Krishna Kumar N
  First published: