3 DEAD AND 4 INJURED IN SHOOTING AT MISSISSIPPI NEW YEAR PARTY IN US MKS
Mississippi shooting : అమెరికాలో మళ్లీ పేలిన తూటా.. New Year Partyలో కాల్పులు.. ముగ్గురు మృతి
మిస్సిస్సిప్పి న్యూ ఇయర్ వేడుకలో కాల్పులు
న్యూ ఇయర్ పార్టీలో పాల్గొన్న వ్యక్తుల మధ్య గొడవ తలెత్తి, ఆగ్రహావేశాలు పెరిగి కాల్పులకు దారితీసింది. పదుల సంఖ్యలో జనం గుమ్మికూడి ఉండగా, గొడవ పడ్డ ఇరు వర్గాలు పరస్పరం తుపాకులతో కాల్పుకున్నాయి. కనీసం 50 రౌడ్ల బుల్లెట్లు ఫైర్ అయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
అగ్రరాజ్యం అమెరికా నెత్తుటి మరకలతో న్యూ ఇయర్ లోకి అడుగు పెట్టింది. దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన గన్ కల్చర్ కు సోదాహరణగా సాయుధులు యధేచ్ఛగా కాల్పులకు తెగబడ్డారు. కొత్త ఏడాది వేడుకలో రెండు గ్రూపుల మధ్య తలెత్తిన గొడవ భారీ కాల్పులకు దారి తీసింది. అత్యాధునిక ఆయుధాలు చేతపట్టిన యువకులు కనీసం 50 రౌండ్ల బుల్లెట్లు కాల్చారు. కొత్త ఏడాది ప్రారంభానికి సరిగ్గా రెండు నిమిషాల ముందు చోటుచేసుకున్న ఈ ఘటనలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక పోలీసులు, మీడియా రిపోర్టులు వెల్లడించిన వివరాలివి..
అమెరికాలోని మిస్సిస్సిప్పిలో ఓ న్యూఇయర్ వేడుక విషాదాంతంగా ముగిసింది. మిస్సిస్సిప్పిలో రాజధాని జాక్సన్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన గల్ఫ్ పోర్ట్ లో శుక్రవారం అర్ధరాత్రి(స్థానిక కాలమానం ప్రకారం) కాల్పుల ఉదంతం చోటుచేసుకుంది. గల్ఫ్ పోర్ట్ సిటీలోని ఓల్డ్ పాస్ రోడ్ ప్రాంతంలో ఓ ఇంటి వద్ద న్యూ ఇయర్ వేడుక జరిగింది. తొలుత కుటుంబీకులు మాత్రమే జరుపుకోవాలనుకున్న ఆ పార్టీకి చుట్టుపక్కల ఇళ్ల వారంతా వచ్చి చేరడంతో చిన్నపాటి కమ్యూనిటీ పార్టీలా మారింది. ఇంకా సేపట్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెడతారనగా..
న్యూ ఇయర్ పార్టీలో పాల్గొన్న వ్యక్తుల మధ్య గొడవ తలెత్తి, ఆగ్రహావేశాలు పెరిగి కాల్పులకు దారితీసింది. పదుల సంఖ్యలో జనం గుమ్మికూడి ఉండగా, గొడవ పడ్డ ఇరు వర్గాలు పరస్పరం తుపాకులతో కాల్పుకున్నాయి. కనీసం 50 రౌడ్ల బుల్లెట్లు ఫైర్ అయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సరిగ్గా రాత్రి 11.58కి ఎమర్జెన్సీ నంబర్ 911కు కాల్పుల ఘటనపై ఫిర్యాదు అందింది. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకోగా..
కాల్పుల్లో ముగ్గురు చనిపోయి కనిపించారు. గాయపడ్డ మరో నలుగురిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉందన్న పోలీసులు.. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ లోని అజ్మీర్ నగ్రీలోనూ న్యూ ఇయర్ పార్టీ వేడుకలో కాల్పులు జరిగాయి. పాక్ ఘటనలో 11ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 18 మంది గాయపడ్డారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.