చైనాకు మరో ఎదురుదెబ్బ.. విచారణ కోరిన 29 దేశాలు

చైనాలో ఉగిర్ ముస్లింల విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్‌లో బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ సహా 29 దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

news18-telugu
Updated: July 1, 2020, 11:27 AM IST
చైనాకు మరో ఎదురుదెబ్బ.. విచారణ కోరిన 29 దేశాలు
చైనా అధ్యక్షుడు జి-జిన్‌పింగ్ (Image : AP)
  • Share this:
చైనాకు మరో ఇబ్బంది కలిగించే పరిణామం చోటు చేసుకుంది. చైనాలో ఉగిర్ ముస్లింల విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్‌లో బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ సహా 29 దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కులకు సంబంధించిన బృందం దర్యాప్తు చేయాలని కోరాయి. చైనాలో పర్యటించి దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాయి. దీనిపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ... ఈ పరిణామం చైనాకు ఇబ్బంది కలిగించే అంశమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక చైనాలో ముస్లింలపై మానవ హక్కుల ఉల్లంఘనలు సర్వసాధారణమైపోయాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు చైనాకి ప్రత్యేక టీమ్‌ని పంపబోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్పింది.ఈ టీమ్ రాకను అనుమతించాలని మే నుంచి WHO కోరుతున్నా... చైనా అనుమతి ఇవ్వలేదు. ఏ జంతువు నుంచి ఆ వైరస్ వచ్చిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని WHO పట్టుపట్టింది. మూలం ఏంటో తెలిస్తే... వైరస్‌తో పోరాడేందుకు మరింత ఎక్కువ వీలు కలుగుతుందని WHO చీఫ్ టెండ్రోస్ అధానమ్ తెలిపారు. తమ టీమ్ మూలాన్ని కనుక్కుంటుందనే నమ్మకం తనకు ఉందన్నారు. ఆ టీమ్‌లో ఎవరెవరు ఉంటారనేది ఆయన చెప్పలేదు. ఈ టీమ్ చైనాకి వెళ్లి... అక్కడి వేర్వేరు ప్రాంతాల్లో కరోనా వైరస్ శాంపిల్స్ సేకరిస్తుంది. అలాగే... అక్కడి అనుమానం ఉన్న జంతువుల్ని సేకరించి వాటిపై పరిశోధనలు చేస్తుంది. వైరస్‌లో జన్యువుల వంటివి... ఇతర జంతువుల్లో ఉన్నట్లు తేలితే... తద్వారా ఏ జంతువు నుంచి అది సోకిందో తెలిసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో చైనా కుట్ర పూరితంగా వైరస్‌ని సృష్టించిందా అనే ప్రశ్నకు కూడా సమాధానం దొరికే అవకాశం ఉంటుంది.

First published: July 1, 2020, 11:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading