LIOC Increases Oil Prices : ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంక నెత్తిన మరో పిడుగు పడింది. పొట్ట నింపుకోవడానికి పడరాని పాట్లు పడుతున్న లంకేయులకు చమురు, నిత్యావసర ధరలు షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే వంట నూనె ధరలు పెరిగి సామాన్యుడిని ఇబ్బందులకు గురిచేస్తోండగా తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయం శ్రీలంక ప్రజలను మరిన్ని ఇబ్బందుల్లో పడేసింది. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. ముడిచమురు ధరలకు అనుగుణంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ(LIOC) శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది.
వాహనదారులకు భారీ షాక్ ఇష్తూ ఏకంగా లీటర్ పెట్రోల్ పై రూ.50, లీటర్ డీజిల్ పై రూ.75 పెంచుతున్నట్లు సంచలన ప్రకటన చేసింది LIOC. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు డబుల్ సెంచరీని దాటేశాయి. శ్రీలంకలో ఒకే నెలలో ఇంధన ధరలను పెంచడం ఇది మూడోసారి. తాజా ధరల పెంపుతో శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ.254, లీటర్ డీజిల్ ధర రూ.214 కి చేరింది. ఈ క్రమంలో ప్రభుత్వం రాయితీలు ప్రకటించి ప్రజలకు ఉపశమనం కల్గించాలని లంక పౌరులు డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ Lockdown In China : కరోనా కొత్త వేరియంట్ విజృంభణ..చైనాలో మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్
ఎల్ఐఓసీ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గుప్తా మాట్లాడుతూ..."శ్రీలంక రూపాయి విలువ భారీగా పతనమైంది. డాలర్ తో పోలిస్తే రూ.57కు తగ్గింది. ఈ విధంగా రూపాయి విలువ క్షీణించడం ఏడు రోజుల్లో ఇది రెండోసారి. ఇది చమురు. గ్యాసోలిన్ ఉత్పత్తుల ధరలను నేరుగా ప్రభావితం చేసింది. అమాంత ఇంధన ధరల పెరుగుదలకు దారి తీసింది. దాంతో పాటు రష్యాను ఒంటరిని చేసేందుకు అమెరికా సహా యూరప్ దేశాలు ఆంక్షలు విధించడం చమురు, గ్యాస్ ధరలు పెరుగుదలకు కారణమవుతున్నాయి .శ్రీలంక సర్కారు నుంచి ఎల్ఐఓసీకి ఎలాంటి రాయితీలు పొందదు. ఫలితంగా అంతర్జాతీయంగా చోటుచేసుకున్న తాజా పరిణామాలతో సంస్థ నష్టపోతోంది. ఈ నష్టాల నుంచి బయటపడాలంటే ఇంధన ధరలు పెంచడం తప్ప వేరే మార్గం లేదు. అయితే ధరలు పెంచినప్పటికీ భారీ నష్టాలు తప్పడం లేదు"అని తెలిపారు. మరోవైపు,దేశీయ విద్యుత్ సంస్థ టర్బైన్ లను నడపేందుకు ఇంధనం లేక భారీగా విద్యుత్ కోతలు విదిస్తోంది శ్రీలంక సర్కారు.
ఇక,ఇదే ప్రభావం భారత్‌లోనూ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ, కేంద్రం మాత్రం అలాంటి పరిస్థితి లేదంటూ చెప్పుకొస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Oil Corporation, Oil prices, Petrol prices, Srilanka