కాలిఫోర్నియాలో కార్చిచ్చు... 23మంది మృతి

సుమారు 6700 భవనాలు మంటల్లో చిక్కుకున్నాయి. దాదాపు 3200 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాలి బలంగా వీస్తుండటంతో మంటలు అదుపులోకి రావడంలేదని అంటున్నారు అధికారులు

news18-telugu
Updated: November 11, 2018, 3:17 PM IST
కాలిఫోర్నియాలో కార్చిచ్చు... 23మంది మృతి
కాలిఫోర్నియాలో కార్చిచ్చు, 23మంది మృతి
  • Share this:
అమెరికా కాలిఫోర్నియాలో కార్చిచ్చు రగులుతోంది. దీంతో ఒక ఊరికి ఊరే అగ్నికి ఆహుతయ్యింది. ఈ ఘటనలో 23మంది మృతిచెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇంకా ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూనే ఉంది.

సుమారు లక్ష ఎకరాల అడవి అగ్నికి ఆహుతైంది. ఒక్క వెంచురాకౌంటీ ప్రాంతంలోనే దాదాపు 15వేల ఎకరాల మేర అగ్నికి ఆహుతైనట్లు

తెలుస్తోంది. సుమారు 6700 భవనాలు మంటల్లో చిక్కుకున్నాయి. దాదాపు 3200 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాలి
బలంగా వీస్తుండటంతో మంటలు అదుపులోకి రావడంలేదని అంటున్నారు అధికారులు. మరోవైపు ముందు జాగ్రత్తగా కార్చిచ్చు చెలరేగిన ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

కాలిఫోర్నియా కార్చిచ్చుపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్... ఈ ఘటన జరగడానికి కారణమంటూ ఏం లేదన్నారు. అటవీ శాఖ నిర్వహణకు ఏటా కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నామన్నారు. అటవీ శాఖ విఫలం అయిందన్నారు. ఎన్ని నిధులు ఇస్తున్నా ఇలాంటి ఘటనల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు ట్రంప్.
Published by: Sulthana Begum Shaik
First published: November 11, 2018, 3:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading