Home /News /international /

22 PEOPLE GET SENTENCE OF 5 YEARS EACH FOR VANDALISING HINDU TEMPLE IN PAKISTAN MKS

Hindu ఆలయంపై దాడి చేసిన 22 మందికి కఠిన శిక్ష.. అది ఉగ్రవాద చర్యే: Pakistan కోర్టు కీలక తీర్పు

గణేశ్ ఆలయంపై దాడి (గతేడాది ఫొటో)

గణేశ్ ఆలయంపై దాడి (గతేడాది ఫొటో)

గణేశ్ టెంపుల్ ను ధ్వంసం చేసిన కేసులో నిందితులకు కఠిన శిక్షలు విధిస్తూ పాకిస్తాన్ యాంటీ టెర్రరిజం కోర్టు తీర్పు వెలువరించింది. మైనార్టీల మందిరాలపై దాడులను ఉగ్రవాద చర్యగానే కోర్టు పరిగణించింది. వివరాలివే..

హిందూ ఆలయాలపై దాడులకు సంబంధించి దాయాది దేశం పాకిస్తాన్ లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పంజాబ్ ప్రావిన్స్ లోని గణేశ్ టెంపుల్ ను ధ్వంసం చేసిన కేసులో నిందితులకు కఠిన శిక్షలు విధిస్తూ పాకిస్తాన్ యాంటీ టెర్రరిజం కోర్టు తీర్పు వెలువరించింది. గతేడాది చోటుచేసుకున్న ఈ ఘటనను అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సీరియస్ గా తీసుకోవడం, ఆలయాలపై దాడులను ఉగ్రవాద చర్యగా పరిగణిస్తూ కేసును యాంటీ టెర్రరిజం విభాగానికి బదిలీ చేయడం విశేషం. గుడిపై దాడి, కోర్టు తీర్పు, అనంతర పరిణామాల వివరాలివే..

పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రం రహీమ్ యార్ ఖాన్ జిల్లా భోంగ్ పట్టణంలో గల గణేశ్ ఆలయంపై 2021 జులైలో స్థానిక ముస్లిం మెజార్టీ మూకలు దాడి చేశాయి. ఎనిమిదేళ్ల హిందూ బాలుడు మదర్సాలో మూత్రవిసర్జన చేశాడనే ఆరోపణతో మొదలైన గొడవ చివరికి ఆలయ ధ్వంసానికి దారితీసింది. మందిరంపై వందలాది మంది దాడి చేసి విగ్రహాలను ధ్వసం చేయడంతోపాటు ఆలయానికి నిప్పు పెట్టారు. సుప్రీంకోర్టు జోక్యంతో అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది.

Karma : కర్మ కాటేసింది.. ప్రేయసిని చంపి.. పాతిపెడుతుండగా.. గుండెపోటుతో బొంద మీదే కుప్పకూలాడు..


టెర్రరిజం ఆరోపణల కింద గతేడాది సెప్టెంబర్ లో మొత్తం 84 మంది అరెస్టు చేశారు. సుదీర్ఘంగా సాగిన విచారణలో నిందితులు నేరం చేసినట్లు పక్కాగా రుజువులు లభ్యంకావడంతో మొత్తం 22 మందిని కోర్టు దోషులుగా ప్రకటించింది. ఆ 22 మందికీ తలా ఐదేళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ పాక్ యాంటీ టెర్రరిజం కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. కోర్టు ఉత్తర్వుల మేరకు ధ్వంసమైన ఆలయాన్ని గతంలోనే పునరుద్దరించారు.

Chicken Price: చికెన్ ధర ఆల్ టైమ్ రికార్డు.. ఏపీలో కేజీ రూ.312 -తెలంగాణలో ఇప్పటికే రూ.300గా..


గణేశ్ టెంపుల్ ధ్వంసం ఘటన సందర్భంలో అప్పటి పాకిస్తాన్ చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ ఆలయాలపై దాడులు, మందిరాల్లో విధ్వంసం, నిర్మాణాల కూల్చివేతలాంటి దుశ్చర్యలు ముమ్మాటికీ తీవ్రవాదంగా పరిగణించాలని, మందిరాలపై దాడులు దేశానికే అవమానకరమని, మైనార్టీల భద్రత, హక్కుల కల్పనకు కోర్టు అండగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Hindu Temples, Pakistan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు