అక్రమ వలసలు (illegal Migration). ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్ని పట్టి పీడిస్తున్న సమస్య. అక్రమ వలసల్ని (illegal Migration) నివారించేందుకు ఆయా దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏదో రూపంలో వలసదారులు వచ్చేస్తున్నారు. జీవన ఉపాధికి, మెరుగైన జీవితం కోసం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి లేదా ఓ దేశం నుంచి మరో దేశానికి వలస సహజమే. అయితే ఈ క్రమంలో చాలామంది అక్రమ మార్గాల్ని అనుసరిస్తుంటారు. చాలా దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. అక్రమ వలసలు ఆపడానికి అమెరికా ఏకంగా గోడనే కడదామని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. యూఎస్ మాజీ అధ్యక్షుడు ట్రంప్ సైతం అప్పట్లో దానిపై సీరియస్‌గానే ఉన్నారు.
అక్రమ వలసల్ని నియంత్రించేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏదో రూపంలో అక్రమ వలసలు పెరుగుతున్నాయి. ఇప్పుడు కొత్త మరో రకం అక్రమ వలస (Illegal Migration) వచ్చి చేరింది. ఎవరూ ఊహించినటువంటి వలస విధానం వచ్చింది. స్పెయిన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని అలర్ట్ చేసింది. ఇంతకీ విషయం ఏమిటంటారా? స్పెయిన్‌లోకి ప్రవేశించడానికి ఏకంగా విమానాలనే ఉపయోగించుకున్న తీరు వలసదారులది. వినడానికి వింతగా ఉన్న వలస దారులు చేసిన పథకం మాత్రం ఔరా అనిపించకమానదు. పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం..
మెడికల్ ఎమర్జెన్సీ అంటూ..
మొరాకో (Morocco) లోని కాసా బ్లాంకా నుంటి టర్కీలోని ఇస్కాంబుల్‌కు ఎయిర్ అరేబియా (Air Arabia)విమానం బయలుదేరింది. ఇందులో చాలామంది మొరాకో (Morocco) దేశస్థులున్నారు. మార్గమధ్యంలో ఓ ప్రయాణికుడు తనకు అనారోగ్యమంటూ లబోదిబో మన్నారడు. దీంతో విమానాన్ని స్పెయిన్ దేశానికి చెందిన పాల్మా డి మాలోర్కా దీవిలో ఉన్న ఎయిర్‌పోర్టు (Airport) కు మళ్లించారు. ఇది స్పెయిన్‌లో (Spain) బిజీగా ఉండే ఎయిర్‌పోర్టు. ఇక్కడి నుంచి నిత్యం వందలాది విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. బాధిత ప్రయాణికుడికి చికిత్స అందించేందుకు మెడికల్ ఎమర్జెన్సీ (medical emergency) నిమిత్తం ఎయిర్ అరేబియా ఫ్లైట్‌ను మాలోర్కా ఎయిర్‌పోర్టులో దించారు. అతడిని ఆసుపత్రికి (hospital) తరలించారు. బాధితుడి వెంట ఓ సహాయకుడు ఉన్నాడు.
22 మంది కిందికి దిగి..
విమానం ఆగడంతో ఇదే అదనుగా భావించి దాదాపు 22 మంది కిందికి దిగి, పరుగులు ప్రారంభించారు. కొందరు ఎయిర్‌పోర్టు కంచెను దాటుకొని బయటకు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. 12 మందిని పట్టుకున్నారు. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు. ఈ గందరగోళం కారణంగా విమానాశ్రయాన్ని శుక్రవారం 4 గంటలపాటు మూసి వేయాల్సి వచ్చింది. దాదాపు 60 విమానాలను దారి మళ్లించారు.
అయితే కొద్దిసేపటికే విమానాశ్రయం అధికారులకు డ్రామా అర్థమైంది. విమానం (Flight)లో ప్రయాణికుడు అనారోగ్యం అంటూ నాటకం ఆడినట్లు తేలింది. అతడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు గుర్తించారు. ప్రయాణికుడి వెంట వచ్చిన సహాయకుడు సైతం పరారయ్యాడు. ఇలాంటి సంఘటన తమ ఎయిర్‌పోర్టులో ఎప్పుడూ జరగలేదని అధికారులు చెప్పారు. స్పెయిన్‌లోకి అక్రమంగా ప్రవేశించడానికే మొరాకో(Morocco) దేశస్తులు ఈ కుట్ర పన్నినట్లు అధికారులు గుర్తించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flight, Illegal immigration, Spain