సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హజ్( Hajj ) యాత్రకు బయల్దేరిన భక్తుల బస్సు(Bus) ఓ వంతెనను ఢీకొట్టింది. ఈదుర్మరణంలో 20మంది చనిపోగా(20Killed)..మరో 30మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి కూడా విషమంగానే ఉందని అక్కడి అధికారులు తెలిపారు. హజ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు యెమెన్(Yemen) సరిహద్దుల్లోని నైరుతి ఆసిర్ ప్రావిన్స్ (Asir Province)దగ్గర బ్రేకులు ఫెయిలవడంతో వంతెనను ఢీకొట్టింది. బస్సు వంతెనను ఢీకొట్టడంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులోని ప్రయాణికులంతా ప్రాణభయంతో అరుపులు, కేకలు పెట్టారు. చూస్తుండగనే బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. లోపలున్న ప్రయాణికులు కొంతమంది చనిపోగా..కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించి గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందం స్పాట్‌కి చేరుకుంది. క్షతగాత్రుల్ని ట్రీట్‌మెంట్ కోసం ఆసుపత్రికి తరలించింది. చనిపోయిన వాళ్ల వివరాలను సేకరించి బంధువులకు చేరవేసింది. ప్రయాణికులంతా ఉమ్రా చేయడానికి మక్కాకు వెళ్తుండగా ఈదుర్ఘటన జరిగింది. రంజాన్ పవిత్ర మాసంలో ఇంతటి ప్రమాదం జరగడం, ప్రాణనష్టం సంభవించడంపై అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.