US Elections 2020: ట్రంప్ సపోర్టర్స్ ర్యాలీలో కాల్పుల కలకలం..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్‌కు ప్రతికూల ఫలితాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మద్ధతుదారులు ఫ్లోరిడాలోని లౌడెర్‌డేల్ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు.

news18-telugu
Updated: November 7, 2020, 12:46 PM IST
US Elections 2020: ట్రంప్ సపోర్టర్స్ ర్యాలీలో కాల్పుల కలకలం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్‌కు ప్రతికూల ఫలితాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మద్ధతుదారులు ఫ్లోరిడాలోని లౌడెర్‌డేల్ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు. కోరల్ రిడ్జ్ మాల్ వెలుపలి ప్రాంతంలో ర్యాలీ జరుగుతుండగా.. దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. కదులుతున్న వాహనంలో నుంచి దుండగుడు కాల్పులు జరిపినట్టుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనంలో దూసుకొచ్చిన దుండగుడు ఓ తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. ట్రంప్ మద్దతుదారుల ర్యాలీని లక్ష్యంగా చేసుకునే దుండగుడు కాల్పులకు దిగినట్టుగా పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడి వెనక అతని ఉద్దేశం తెలియాల్సి ఉందన్నారు.

ఇక, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబందించిన కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడన్ 264, రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ 213 ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించారు. ఇక, ఇప్పటికే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు తుది దశకు చేరింది. మరో ఐదు రాష్ట్రాల్లో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ క్రమంలోనే అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై అమెరికాలో పలుచోట్ల నిరసనకారులు ఆందోళనలు చేపడుతున్నారు. కొందరు ప్రతి ఓటును లెక్కించాలని కోరగా, మరికొందరు మాత్రం లెక్కింపును నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో తొలుత బైడెన్, ట్రంప్ మధ్య హోరా హోరీ పోరు సాగిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత బైడెన్ ఫలితాల్లో అధిక్యం ప్రదర్శించాడు. ప్రస్తుతం బైడెన్ విజయానికి కేవలం ఆరు ఎలక్ట్రోరల్ స్థానాల దూరంలో నిలిచాడు. మరో మూడు రాష్ట్రాల్లో బైడెన్ అధిక్యంలో కొనసాగుతున్నాడు. దీంతో బైడెన్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవడమే లాంఛనమేనని అంతా భావిస్తున్నారు. మరోవైపు ట్రంప్ మాత్రం ఎన్నికల ఫలితాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొన్ని చోట్ల  ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని ట్రంప్ పార్టీ న్యాయ స్థానాలను ఆశ్రయించింది.
Published by: Sumanth Kanukula
First published: November 7, 2020, 12:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading