పాకిస్తాన్‌లోని భారత హైకమిషన్‌కు చెందిన ఇద్దరు అధికారులు సోమవారం ఉదయం నుంచి ఆచూకీ లభించడం లేదు. అధికార వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఇద్దరు అధికారులు ఇస్లామాబాద్‌లో కార్యాలయ పనులకు బయలుదేరారు, ఆ తర్వాత వారి నుంచి ఎటువంటి సమాచారం రావడం లేదు. రెండు మొబైల్ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. ఇదే విషయమై పాకిస్తాన్ అధికారుల్ని భారత్ సంప్రదించింది.
కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ లో తమ దౌత్యవేత్తలను వేధిస్తున్నారని భారత్ వేలెత్తి చూపింది. అయితే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డిటెక్టివ్ ఒకరు... పాక్ లోని భారత దౌత్యవేత్త గౌరవ్ అహ్లువాలియా కారును వెంబడిస్తున్నట్లు ఇటీవల ఓ వీడియో బయటపడింది. అదే సమయంలో, కొంతమంది అహ్లువాలియా ఇంటి వెలుపల కూడా కనిపించారు.
భారత రాయబార కార్యాలయాల అధికారులను వేధించిన ఫిర్యాదులపై ఇప్పటికే భారత్ పాకిస్తాన్ విదేశాంగ శాఖకు నోటీసు కూడా ఇచ్చింది. పాకిస్తాన్ తన దౌత్యవేత్తలకు తగిన భద్రత కల్పించాలని భారత ప్రభుత్వం హెచ్చరించింది.
Published by:Krishna Adithya
First published:June 15, 2020, 11:42 IST