మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం (Mexico accident) జరిగింది. యాత్రికులతో వెళ్తతున్న ఓ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న భవనంలోకి (Bus Rams into Building) దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. మరో 32 మందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెక్సికో సిటీ (Mexico city accident)లోని జాక్వికింగో ప్రాంతాల్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. స్థానిక అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. చల్మా పట్టణం క్రిస్టియన్లకు పుణ్యక్షేత్రం. డిసెంబరు 12న మెక్సికోలో వర్జిన్ ఆఫ్ గ్వాడలుపే డేను రోమన్ క్యాథలిక్కులు ఘనంగా జరుపుకుంటారు. చాలా మంది యాత్రికుచాల్మా పట్టణాన్ని సందర్శిస్తారు. వందల ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం వస్తోంది. ఈ క్రమంలోనే మిచోకన్ పట్టణానికి చెందిన పలువురు యాత్రికులు బస్సులో చల్మా పట్టాణానికి బయలుదేరారు.
అమెరికాకు బుద్ధి చెప్పేలా మోదీ మంత్రాంగం -డిసెంబర్ 6న రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ రాక
శుక్రవారం ఆ బస్సు మెక్సికో సిటీ మీదుగా వెళ్తుండగా బ్రేకులు ఫెయిలయ్యాయి. అలా అతివేగంతో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న ఓ భవనంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా ధ్వంసమయింది. ప్రమాదంలో 19 మంది దుర్మరణం చెందారు. చల్మా పట్టణానికి వెళ్లే రోడ్లు చాలా ఇరుకుగా ఉంటాయి. చాలా మంది బైక్‌లు, కార్లలోనే వెళ్తుంటారు. కొందరు మాత్రం ప్రైవేట్ ట్రావెల్స్ బుక్ చేసుకొని ప్రయాణికులు సాగిస్తుంటారు. ఆ సన్నని రోడ్లలో ప్రమాదాలు జరగడం సర్వసాధారణమని స్థానికులు చెబుతున్నారు.
Coal mine Explosion: బొగ్గు గనిలో ఘోర ప్రమాదం.. భారీ పేలుడు ధాటికి 52
కాగా, రెండు వారాల క్రితం కూడా మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెక్సికో సిటీని ప్యూబ్లాను కలిపే హైవేపై ట్రక్కు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో అదుపు తప్పి రోడ్డుపై వెళ్తున్న కార్లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 20 మంది మరణించారు. ఆ దుర్ఘటనను మరవకముందే మెక్సికో సిటీలో మరో రోడ్డు ప్రమాదం జరగడం.. ఇప్పుడు 19 మంది మరణించడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్యం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mexico, Road accident