షాకింగ్‌ : పొద్దున లేచేసరికి గర్భమొచ్చింది.. నిమిషాల్లోనే బిడ్డ పుట్టింది..

మహిళ గర్భవతి అయిందంటే ఆమెకున్న ఆనందం అంతా ఇంతా కాదు. మొదటి నెల నుంచే ఎంతో జాగ్రత్తగా కంటికి రెప్పలా బిడ్డను కాచుకుని ఉంటుంది తల్లి. కానీ.. ఓ మహిళకు తనకు తెలియకుండానే ఉదయం లేచేసరికి గర్భం వచ్చింది.. ఆస్పత్రికి వెళ్లేలోపే బిడ్డ పుట్టింది..

Amala Ravula | news18-telugu
Updated: April 10, 2019, 10:29 AM IST
షాకింగ్‌ : పొద్దున లేచేసరికి గర్భమొచ్చింది.. నిమిషాల్లోనే బిడ్డ పుట్టింది..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: April 10, 2019, 10:29 AM IST
స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గోవ్‌లో ఓ వింత జరిగింది. ఎమ్మాలూయిజ్ లెగ్గాటే అనే 18ఏళ్ల అమ్మాయి రాత్రి పడుకునేటప్పుడు బాగానే ఉంది.. ఉదయం లేచేసరికి కడుపు ఎత్తుగా ఉంది. దీంతో.. భయపడిపోయిన లెగ్గాటే అమ్మమ్మ లూయిజ్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కారులో ఎక్కించుకుని ఆస్పత్రికి వెళ్లి.. కారు పార్కు చేసేలోపే పండంటి మగబిడ్డ పుట్టాడు. ఇదంతా కేవలం 45 నిమిషాల్లోనే జరిగింది.
ఎమ్మాలూయిజ్ తన బాయ్‌ఫ్రెండ్, అమ్మమ్మతో కలిసి నివసిస్తుంది. కొన్ని నెలల క్రితమే ఆమెకి ఓ పాప కూడా పుట్టింది. అప్పట్నుంచి కొన్ని ట్యాబ్లెట్స్ వాడుతోంది.. ఇదే సమయంలో రుతుస్రావం ఆగిపోయింది. అయితే, మందుల కారణంగానే ఇలా అయి ఉంటుందని భావించింది ఎమ్మలూయిజ్. బరువు పెరిగినప్పటికీ రోజూ వాకింగ్ చేసేది.. ఇలా తనకు తెలియకుండానే గర్భం దాల్చింది. అయితే బిడ్డ నడుముకి కింది భాగంలోనే పెరిగింది. దీంతో కడుపు పైకి కనిపించలేదు. అలాగే 8నెలలవరకు తనకు తెలియకుండానే బిడ్డను మోసింది. 8 నెల వచ్చేసరికి బిడ్డ కదలికలు వేగమై ఉదయం అయ్యేసరికి కడుపు ఎత్తుగా అయి నొప్పులు వచ్చాయి. ఇలానే బిడ్డకు ఎమ్మాలూయిజ్ జన్మనిచ్చిందని వైద్యులు తెలిపారు. ఇది అరుదైన ఘటన అని తెలిపింది.
2018 జులై 17నే ఈ ఘటన జరిగింది. కానీ, ఇప్పుడు ఈ విషయం ఓ ఇంగ్లీష్ మేగజైన్ ప్రచురించడంతో ఫుల్ వైరల్‌గా మారింది.

First published: April 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు