• Home
  • »
  • News
  • »
  • international
  • »
  • 18 YEAR OLD GIRL DIES AFTER BENJAMIN BUTTON DISEASE LEFT HER WITH BODY OF 144 YEAR OLD SSR

Very Sad: ఆమె వయసు 18.. శరీరం వయసు 144.. చనిపోయే ముందు ఆమె చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..

తల్లితో అషంతి, ఆమె కుటుంబం

వెస్ట్ సస్సెక్స్‌కు చెందిన అషంతి స్మిత్ అనే 18 ఏళ్ల బాలిక ‘బెంజమిన్ బటన్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి సోకిన వారు వయసు తక్కువగానే ఉన్నా ముసలి వారిలా కనిపిస్తారు. వారి శరీరం కూడా అలానే ఉంటుంది. అషంతి పరిస్థితి కూడా అదే. అషంతి వయసు 18 సంవత్సరాలే కానీ ఈ వ్యాధి కారణంగా ఆమె శరీరం 144 సంవత్సరాల వయసున్న మనిషికి శరీరం ఎలా ఉంటుందో అలా అయింది.

  • Share this:
    మనిషిగా పుట్టడం అదృష్టం అంటుంటారు. కానీ.. ఆ మనిషికి పుట్టుకతోనే ఏదైనా వైకల్యం ఉంటే.. అంతుపట్టని వ్యాధి ఉంటే ఆ బిడ్డకు, తల్లిదండ్రులకూ అంతకు మించిన నరకం మరొకటి ఉండదు. అయితే.. పుట్టిన బిడ్డ ఎలా ఉన్నా ఆ తల్లిదండ్రులు బిడ్డను సంతోషంగా చూసుకునేందుకే ప్రయత్నిస్తారు. ఆ వైకల్యాన్ని మరిపించేలా ప్రేమను పంచుతారు. కానీ.. ఆ బిడ్డ పుట్టినరోజు జరుపుకున్న వారాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతే.. ఆ తల్లిదండ్రుల గుండె బద్ధలవుతుంది. ఇంగ్లండ్‌లోని వెస్ట్ సస్సెక్స్‌లో ఓ తల్లికి అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. వెస్ట్ సస్సెక్స్‌కు చెందిన అషంతి స్మిత్ అనే 18 ఏళ్ల బాలిక ‘బెంజమిన్ బటన్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి సోకిన వారు వయసు తక్కువగానే ఉన్నా ముసలి వారిలా కనిపిస్తారు. వారి శరీరం కూడా అలానే ఉంటుంది. అషంతి పరిస్థితి కూడా అదే. అషంతి వయసు 18 సంవత్సరాలే కానీ ఈ వ్యాధి కారణంగా ఆమె శరీరం 144 సంవత్సరాల వయసున్న మనిషికి శరీరం ఎలా ఉంటుందో అలా అయింది. అయితే.. కూతురికి వచ్చిన ఈ అరుదైన వ్యాధి గురించి కొన్నాళ్లు బాధపడినా ఆమె తల్లిదండ్రులు ఆ తర్వాత బిడ్డను ఆ సమస్య నుంచి బయటపడేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో ఆమెను బతికినంతకాలం సంతోషంగా ఉంచాలనుకున్నారు. ఆ దంపతులకు మరో ఇద్దరు పిల్లలున్నారు. ఈ పాపను కూడా వైకల్యంతో ఉందని వివక్ష చూపకుండా మిగిలిన పిల్లల్లానే అపురూపంగా చూసుకున్నారు. ఇంట్లో ఆ పాపకు ఎలాంటి చేదు అనుభవం ఎదురుకానప్పటికీ సమాజంలో మాత్రం వివక్ష ఎదురైంది. ఆమె తోటి పిల్లలు అషంతిని చూసి గేలి చేసేవారు.

    దీంతో.. ఆ పాప బయటకు వెళ్లడమే మానేసింది. ఇంట్లో చెల్లి, తమ్ముడితో ఆడుకుంటూ ఉండేది. కొన్ని వారాల క్రితమే అషంతి పుట్టిన రోజు కూడా జరుపుకుంది. ఆమె 18వ పుట్టినరోజును తల్లిదండ్రులు ఘనంగా చేశారు. కానీ.. పుట్టినరోజు జరుపుకున్న కొద్ది రోజులకే ఆమె ఆరోగ్యం క్షీణించింది. జులై 17న అషంతి స్మిత్ తుది శ్వాస విడిచింది. ఆమె చనిపోయే కొద్ది క్షణాల ముందు తల్లితో చెప్పిన మాటలు కంటతడి పెట్టించాయి. ఆ బాలిక చనిపోయే ముందు తల్లితో మాట్లాడుతూ... ‘మీరు నన్ను వెళ్లనివ్వాలమ్మా’ అని నైరాశ్యంగా మాట్లాడిన మాటలు తలుచుకుంటేనే బాధ కలుగుతుంది.

    ఆమె తల్లిదండ్రులు ఫొబి, షేన్ వికెన్స్ కూతురిని తలుచుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. అషంతి ఎప్పుడూ తనకు ఉన్న వ్యాధిని తలచుకుని బాధపడేదే కాదని.. అందరితో కలిసిపోతూ ఎంతో ఉత్సాహంగా ఉండేదని.. అలాంటి కూతురు లేదనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమె చాలా తెలివైందని.. ఆమె మనోధైర్యానికి మెచ్చుకోకతప్పదని ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు చెప్పారు. అరుదైన ‘బెంజమిన్ బటన్’ అనే ఈ జన్యుపరమైన వ్యాధికి చికిత్స లేదు. కోట్ల మందికి కొందరు ఈ వ్యాధి బారిన పడతారు.
    Published by:Sambasiva Reddy
    First published: