Home /News /international /

18 NEW VIRUSES POTENTIALLY HIGH RISK TO HUMANS FOUND IN CHINA WET MARKETS SAYS REPORTS MKS

China : మరో 18 ప్రమాదకర వైరస్‌లు -చైనా మాంసం మార్కెట్లలో గుర్తించిన సైంటిస్టులు

చైనాలో ఓ మాంసం దుకాణం

చైనాలో ఓ మాంసం దుకాణం

కరోనా వైరస్ మొదట జంతువుల ద్వారానే మనిషికి సోకినట్లు నిర్దారణ అయిన నేపథ్యంలో చైనాతోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, బెల్జియం దేశాలకు చెందిన సైంటిస్టులు సంయుక్తంగా పరిశోధనలు జరిపారు. చైనాలో మొత్తం 71 రకాల వైరస్ లు ఉన్నట్లు ఆ పరిశోధనల్లో తేలిసింది. వాటిలో 18 వైరస్ లు మనుషులకు ప్రమాదం కొనితెచ్చేవని సైంటిస్టులు నిర్ధారణకు వచ్చారు.

ఇంకా చదవండి ...
కరోనా మహమ్మారి సృష్టించిన విలయం నుంచి పూర్తిగా తేరుకోకముందే మరో షాకింగ్ వార్త. కరోనా (coronavirus) తో కథ ముగిసిపోలేదా? కరోనాకు తాతా లాంటి వైరస్ లు భూగోళాన్ని చుట్టముట్టబోతున్నాయా? వైరస్‌ల కార్ఖానాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా నుంచే అవి పుట్టుకురానున్నాయా? అంటే ప్రస్తుతానికి అవుననే సమాధానమిస్తున్నారు సైంటిస్టులు, వైరాలజిస్టులు. కరోనా పుట్టినిల్లయిన చైనా (China)  దేశంలో మరోసారి వైరల్ ల కలకలం మొదలైందని, ఏకంగా 18 ప్రమాదకర వైరస్ లు అక్కడి మాంసం మార్కెట్లలో పురుడుపోసుకున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచం నిద్రను దూరం చేసే ఈ వార్త వివరాల్లోకి వెళితే..

చైనాలో, వూహాన్ నగరంలోని మాంసం మార్కెట్ల నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రపంచ మంతా విస్తరించి ఇవాళ్టికి(బుధవారం నాటికి) అక్షరాలా 51.33లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. ఇది చాలదన్నట్లుగా, కరోనా పుట్టినిల్లు చైనాలో మరోసారి వైరస్ ల కలకలం మొదలైంది. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 71 రకాల వైరస్ లను గుర్తించారు ప్రఖ్యాత అంతర్జాతీయ సైంటిస్టులు. ఆ 71లో 18 వైరస్ లు మానవుల పాలిట ప్రమాదకరమైనవిగా పేర్కొన్నారు.

shocking : మనవరాలి శవం పక్కనే.. కన్నకూతురిపై తండ్రి అత్యాచారం -కసి ఈనాటిది కాదంటూ..


ఇతర జీవరాశుల నుంచే కరోనా వైరస్ మనుషులకు సోకిందనే ఇదివరకటి పరిశోధనల్లో వెల్లడయిన నేపథ్యంలో చైనాలోని మాంసం మార్కెట్లే టార్గెట్ గా శాస్త్రవేత్తల బృందాలు కీలక పరిశోధనలు, పరీక్షలు జరిపాయి. చైనాతోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, బెల్జియం దేశాలకు చెందిన సైంటిస్టులు సంయుక్తంగా పరిశోధనలు జరిపారు. 16 రకాల వివిధ జాతులకు చెందిన 1725 వణ్యప్రాణులపై పరీక్షలు జరిపి.. మొత్తం 71 రకాల వైరస్ లు ఉన్నాయని, వాటిలో 18 వైరస్ లు మనుషులకు ప్రమాదం కొనితెచ్చేవని నిర్ధారణకు వచ్చారు.

Hyderabad: ఏం ఫ్యామిలీరా బాబూ! -19ఏళ్ల కూతురిని అందంగా ముస్తాబు చేసి.. వీళ్ల కథే వేరు!


చైనా ప్రభుత్వం అమ్మకాలపై నిషేధం విధించిన పలు జంతువులపైనా సైంటిస్టులు పరీక్షలు చేశారు. నాలుగు దేశాల సైంటిస్టులు జరిపిన పరిశోధనల రిపోర్టులను పలు సైన్స్ జర్నల్స్ ప్రచురించాయి. సైంటిస్టులు జరిపిన పరీక్షల్లో 71 రకాల వైరస్ లను గుర్తించామని, వాటిలో 45 వైరస్ లు కొత్తగా కనుగొన్నామని, మళ్లీ అందులో 18 రకాల వైరస్ లు మనుషులకు, జంతువులకు కూడా చాలా ప్రమాదకరమైనవని, వైరస్ ల వ్యాప్తిలో వణ్యప్రాణులదే కీలక పాత్ర అని చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన సైంటిస్టు షూసు అన్నట్లు జర్నల్ లో పేర్కొన్నారు.

విమానంలో విపత్తు : వ్యక్తి ప్రాణాలు కాపాడిన కేంద్ర మంత్రి భాగవత్ -డాక్టర్ అంటే అంతేనన్న మోదీ


మన ఇళ్లల్లో తిరిగే పిల్లులను పోలి ఉండే సివెట్స్ అనే జంతువుల్లోనే అత్యధికంగా ప్రమాదక వైరస్ లను గుర్తించామని, గబ్బిలాల నుంచి వచ్చే హెచ్కేయూ 8 రకం వైరస్.. సివెట్ జంతువుకు కూడా సోకినట్లు గుర్తించామని, ఈ ప్రమాదకర వైరస్ లు పలు జంతువుల్లో వ్యాప్తిస్తున్నదని సైంటిస్టులు చెప్పారని ప్రచురణలో పేర్కొన్నారు. కరోనా దెబ్బకు కకావికలైన భూగోళం.. నిజంగానే చైనా నుంచి మరో విపత్తు వస్తే తట్టుకోగలదా?
Published by:Madhu Kota
First published:

Tags: China, Coronavirus, Virus

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు