హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

రెస్టారెంట్ లో భారీ అగ్ని ప్రమాదం.. 17 మంది సజీవదహనం.. ఎక్కడంటే..

రెస్టారెంట్ లో భారీ అగ్ని ప్రమాదం.. 17 మంది సజీవదహనం.. ఎక్కడంటే..

ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది

ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది

China Fire accident: ఈశాన్య చైనాలోని ఒక రెస్టారెంట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో సెకనుల వ్యవధిలోనే మంటలు రెస్టారెంట్ అంతటా వ్యాపించాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Goa, India

చైనాలో (China) బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చాంగ్‌చున్ నగరంలోని ఒక తినుబండారంలో మధ్యాహ్నం 12:40 గంటలకు (0440 GMT) మంటలు చెలరేగాయని స్థానిక అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వెంటనే అధికారులు అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలను ప్రారంభించారు. "గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి పంపారు. కాగా, అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఒక్కసారిగా రెస్టారెంట్ అంతట నల్లని పొగలు వ్యాపించాయి. దీంతో అందరు బయటకు రావడానికి ప్రయత్నించిడం వలన తొక్కిసలాట జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఊపిరాడక కూడా చనిపోయి ఉంటారని సమాచారం.

ఇదిలా ఉండగా ఆ ప్రాంతంలోని చుట్టుపక్కల కూడా నల్లని దట్టమైన పొగలు వ్యాపించి ఉన్నాయి. దీంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. రెస్టారెంట్ లో ఎంత మంది ఉన్నారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఫైర్ సిబ్బంది హోటల్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దట్టమైన పొగలు కమ్ముకొవడంతో అక్కడ ఇబ్బంది కరంగా మారింది. చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటి వరకు ఈ ఘటనలో 17 మంది సజీవదహనమయ్యారు. అగ్ని  ప్రమాదం (Fire accindent)  జరిగిన ప్రదేశంలో భారీ ఎత్తున ఫైరింజన్ లు, అంబులెన్స్ లు చేరుకున్నాయి. గాయపడిని వారిని ఆస్పత్రులకు తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులు వైద్యులను కోరారు.  ఘటనకు గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా గతంలో ఆఫ్రికా దేశం ఈజిప్ట్‌లో ఘోర (Egypt Fire Accident) అగ్నిప్రమాదం జరిగింది.

కైరోలో ఉన్న ఓ కాప్టిక్ చర్చిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 41 మంది సజీవ దహనమయ్యారు. మరో 14 మంది గాయపడినట్లు ఈజిప్ట్ అధికారులు వెల్లడించారు. కైరోఉన్న అబూ సెఫీన్ చర్చి (Abu Sefein Church Fire Accident) చాలా ఫేమస్. ఇక్కడికి ప్రతి ఆదివారం క్యాప్టిక్ క్రైస్తవులు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఈ ఆదివారం కూడా చాలా మంది చర్చికి వచ్చి ప్రార్థనలు చేశారు. ఈ క్రమంలోనే చర్చిలో మంటలు చెలరేగాయి. దట్టమైన నల్లటి పొగలు.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు చెలరేగడంతో.. వాటి నుంచి తప్పించుకునేందుకు చాలా మంది బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి కొందరు చనిపోయారు. దట్టమైన పొగలతో మరికొందరు ఊపిరాడక మరణించారు.  ఇంకొందరు మంటల్లో కాలిపోయి.. బూడిదయ్యారు. ఐతే ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. చర్చి లోపల షార్ట్ సర్క్యూట్ జరగడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Published by:Paresh Inamdar
First published:

Tags: China, Fire Accident

ఉత్తమ కథలు