Home /News /international /

16 FEET CURSED OAR FISH CAUGHT IN CHILE PREDICTS OF NATURAL DISASTER HERE ARE SCIENTIFIC CLARIFICATION SK

Oarfish: ఆ రాకాసి చేప మళ్లీ దొరికింది.. ఇది దేనికి సంకేతం.. అపశకునమా.. సునామీ వస్తుందా?

జెయింట్ ఓర్‌షిఫ్

జెయింట్ ఓర్‌షిఫ్

Oar Fish: భూమి లోపల టెక్టోనిక్ ప్లేట్లలో ఘర్షణ జరిగి ఉండాలని.. సముద్ర గర్భంలో అలాంటి సమస్యలు వస్తేనే.. ఇవి సముద్రంపైకి వస్తుంటాయని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు.

    ఈ భూమండలంపై ఎన్నో రకాల ప్రాణాలు జీవిస్తున్నాయి. భూభాగం కంటే ఎక్కువ విస్తీర్ణముండే సముద్రాల్లో లక్షల జాతుల జీవులు నివసిస్తున్నాయి. అందులో మనకు కొన్నింటి గురించి మాత్రమే తెలుసు. మనకు తెలియని ఎన్నో వింత జీవులు సముద్ర గర్భంలో ఉన్నాయి. ఐతే రెక్క గుర్రం, జలకన్య వంటి కొన్ని ప్రాణులు పౌరాణిక కథల్లో మాత్రమే కనిపిస్తాయి. ఎన్నో కథలు, సినిమాల్లో వాటిని చూశాం. నిజ జీవితంలో ఎవరూ చూడలేదు. చిలీ (Chile) లో నివసిస్తున్న కొంత మంది మత్స్య కారులు ఇలాంటి జీవిని గుర్తించారు. ఇది అచ్చం సినిమాల్లో చూపించే.. శాపగ్రస్త చేపను పోలి ఉంది. ఈ నేపథ్యంలో దాని వల్ల ఏం జరుగుతుందోనని.. ఎలాంటి విపత్తు మంచుకొస్తుందోనని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



    OMG: టాయ్ లేట్ లో అనుకోని అతిథి.. భయంతో పరుగులు పెట్టిన మహిళ

    చిలీలో దొరికిన ఆ చేపను జెయింట్ ఓర్ ఫిష్  (Giant Orefish) అంటారు. కింగ్ ఆఫ్ హెర్రింగ్స్ అని పిలుస్తారు. దీని పొడవు ఐదు మీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే దాదాపు 16 అడుగులు. ఈ రాకాసి చేప దొరికిందని తెలియగానే.. ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. ప్రస్తుతం ఆ వీడియో టిక్‌టాక్‌లో వైరల్‌గా మారింది. మన దేశంలో టిక్‌ టాక్‌పై నిషేధం ఉన్నందున..దీని వీడియోలు మనకు అంతగా కనిపించడం లేదు. కానీ దాని ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల హుక్‌కు ఇది చిక్కింది.



    ఓర్ షిఫ్‌లు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఎన్నో పౌరాణిక కథలలో కూడా దీని గురించి చెప్పారు. ఈ చేపలు భవిష్యత్తును అంచనా వేస్తాయని చెబుతుంటారు. ఓర్ చేప కనిపించిస్తే.. అది అపశకునమని విశ్వసిస్తారు. ఏదో కీడు జరగబోతుందని నమ్ముతారు. ఈ చేప 2011లో జపాన్‌ సముద్ర తీరంలో కనిపిచిందని.. ఆ తర్వాత భారీ సునామీ జపాన్‌పై విరుచుకుపడిందని కొందరు చెబుతున్నారు. జపాన్‌లో సునామీని ఓర్ ఫిష్ ముందుగానే పసిగట్టిందని.. ఇప్పుడు చిలీలో కూడా అలాంటి విపత్తే రావచ్చని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.



    Marburg: కరోనా కంటే భయంకరమైన వైరస్.. సోకిందంటే మరణమే.. ఆ దేశంలో వెలుగులోకి..

    చిలీలో దొరికిన ఓర్ ఫిష్ వీడియో..ఆ దేశంలో టిక్‌టాక్‌లో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు 10 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. ఓర్ ఫిష్ కనిపించిందంటే.. చిలీలో భూకంపం లేదా సునామీ రావడం ఖాయమని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అలాగని ఇది మూఢనమ్మకని కొట్టిపారేయొద్దు. ఓర్ చేపలు సముద్ర గర్భంలో చాలా లోతున జీవిస్తాయి. చాలా అరుదుగా మాత్రమే ఇవి సముద్ర ఉపరితలానికి వస్తుంటాయి. భూమి లోపల టెక్టోనిక్ ప్లేట్లలో ఘర్షణ జరిగి ఉండాలని.. సముద్ర గర్భంలో అలాంటి సమస్యలు వస్తేనే.. ఇవి సముద్రంపైకి వస్తుంటాయని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ఇవికి పైకి రావడం మంచి సంకేతం కాదు అంటున్నారు. ఈ నేపథ్యంలో చిలీలో ప్రక‌ృతి విపత్తు సంభవించే అవకాశముందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కొందరు మాత్రం ఇవన్నీ పుకార్లని..ఎవరూ నమ్మవద్దని సూచిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Chile, Fish, Trending, Viral vide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు