హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Corona Vaccination: ఆ సంస్థ ఉద్యోగులకు వ్యాక్సిన్ తప్పనిసరి.. లేకుంటే జీతంలో రూ. 15 వేలు కట్.. ఉద్యోగం నుంచి కూడా తొలగించే ఛాన్స్

Corona Vaccination: ఆ సంస్థ ఉద్యోగులకు వ్యాక్సిన్ తప్పనిసరి.. లేకుంటే జీతంలో రూ. 15 వేలు కట్.. ఉద్యోగం నుంచి కూడా తొలగించే ఛాన్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వ్యాక్సినేషన్(Corona Vaccination) ప్రపంచ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు(Employees) కు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేశాయి. వ్యాక్సిన్ వేయించుకోకపోతే జీతం కట్ చేస్తామని హెచ్చరిస్తున్నాయి. మరి కొన్ని సంస్థలైతే ఉద్యోగం తీసేస్తామని స్పష్టం చేస్తున్నాయి.

ఇంకా చదవండి ...

కరోనా నేపథ్యంలో జన జీవనంలో వివపరీతమైన మార్పులు వచ్చాయి. మన దేశంలోని ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు, ప్రజల జీవన విధానం కారణంగా ఈ వైరస్ ఎక్కువ కాలం ఇక్కడ మనుగడ సాగించలేదని అంతా భావించారు. కానీ పరిస్థితి మారింది. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా వైరస్ వచ్చే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న అనేక మంది వైరస్ భారిన పడ్డారు. అయితే.. వ్యాక్సిన్ వేయించుకోని వారితో పోల్చితే వేయించుకున్న వారిలో వైరస్ ప్రభావం చాలా తక్కువగా కనిపించింది. వ్యాక్సిన్ వేయించుకోవడం స్వచ్ఛందమేనని ప్రభుత్వాలు చెబుతున్నా.. అందరూ తప్పనిసరిగా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రైన్లు, ఫ్లైట్లు, ఆలయాలు ఇలా అనేక చోట్లకు వ్యాక్సిన్ వేయించుకున్న వారినే అనుమతిస్తున్నారు. అనేక సంస్థలు సైతం తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని తమ ఉద్యోగులకు స్పష్టం చేస్తున్నాయి. వ్యాక్సిన్ వేయించుకోకపోతే విధుల్లోకి అనుమతించమని తేల్చిచెబుతున్నాయి. తాజాగా ప్రముఖ డెల్టా ఎయిర్ లైన్స్ ఇలాంటి ఓ ప్రకటన చేసింది. వ్యాక్సిన్ రెండు డోసులను తప్పనిసరిగా తీసుకోవాలని తన ఉద్యోగులకు స్పష్టం చేసింది సంస్థ. ఎవరైనా ఉద్యోగులు కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకోకపోతే నెలకు వేతనంలో నుంచి రూ .15,000 వసూలు చేస్తామని తెలిపింది డెల్టా ఎయిర్ లైన్స్.

సెప్టెంబర్ 30 తర్వాత జీతం చెల్లించబడదు

సెప్టెంబర్ 30 తర్వాత వ్యాక్సినేషన్ చేయించుకోకుండా ఎవరైనా ఉద్యోగి కనిపిస్తే, అతని జీతం నిలిపివేయబడుతుందని ఎయిర్‌లైన్ బుధవారం తెలిపింది. కంపెనీ ఉద్యోగులంతా మాస్కు ధరించాలని తెలిపింది.

Covid: కరోనా ఆగాలంటే మూడో డోస్ పడాల్సిందే.. పరిశోధకుల మాట

ఉద్యోగం తొలగింపు..

యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సైతం తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పై కీలక ప్రకటన చేసింది. తమ ఉద్యోగులంతా సెప్టెంబర్ 27 లోపు టీకాలు వేయించుకోవాలని సూచించింది. సెప్టెంబర్ 27 తర్వాత వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అవసరమైతే ఉద్యోగాలను కూడా తొలగిస్తామని స్పష్టం చేసింది యునైటెడ్ ఎయిర్ లైన్స్. అయితే.. రానున్న రోజుల్లో దాదాపు అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసే అవకాశం ఉంది.

India Corona cases: డేంజర్ బెల్స్.. భారత్‌లో అనూహ్యంగా పెరిగిన కోవిడ్ కేసులు..

ఇదిలా ఉంటే.. భారత్‌లో గడిచిన 24 గంటల్లో 46,164 కరోనా కేసులు నమోదయ్యాయి. 34,159 మంది కోలుకున్నారు. మరో 607 మంది మరణించారు. థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలోనే..కొత్త కేసులు మళ్లీ 40వేలకు పైగా నమోదవడం...ఆందోళన కలిగిస్తోంది. తాజా కేసులతో ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 3,25,58,530కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3,17,88,440 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,36,365 మంది మరణించారు. ప్రస్తుతం మనదేశంలో 3,33,725 యాక్టివ్ కేసులున్నాయి. ఐతే మనదేశంలో కేవలం కేరళలోనే భారీగా కేసులు వస్తున్నాయి.

Third Wave: ముంచుకొస్తోంది మూడో ముప్పు.. పెద్దలతో సమానంగా పిల్లలకు హెచ్చరిక.. తస్మాత్ జాగ్రత్త..!

నిన్న ఒక్క రోజే 31,445 మందికి కరోనా నిర్ధాణ అయింది. దేశవ్యాప్తంగా నమోదయిన కేసుల్లో ఏకంగా 68 శాతం కేసులు కేరళలోనే నమోదయ్యాయి. ఓనం పండగ తర్వాత భారీగా కేసులు వస్తున్నాయి. దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల్లో సగానికి పైగా కేరళలోనే ఉన్నాయి. కేరళ తర్వాత మహారాష్ట్రలో ఎక్కువ కేసులు (5,031) నమోదవుతున్నాయి. రెండు రోజులుగా మరణాల సంఖ్య కూడా పెరిగింది. ప్రతి రోజు 600కు పైగా మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న దేశవ్యాప్తంగా 17,87,283 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 51.31 కోట్ల టెస్ట్‌లు నిర్వహించారు. నిన్న మన దేశంలో 80,40,407 మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు 60.38 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు.

First published:

Tags: Corona Vaccine, Covid -19 pandemic, Vaccination