కారులో 15 అడుగుల పాము... ఎలా వచ్చింది? ఏం చేసింది?

Snake in Car : అరుదైన సందర్భాల్లో పాములు వాహనాల్లోకి వెళ్లి తిష్ట వేస్తుంటాయి. మరి ఆ పాము విషయంలో ఏం జరిగింది? అధికారులు ఏం చేశారు?

Krishna Kumar N | news18-telugu
Updated: July 17, 2019, 1:52 PM IST
కారులో 15 అడుగుల పాము... ఎలా వచ్చింది? ఏం చేసింది?
కారులో పాము (Image : Twitter / Denver Fire Dept)
  • Share this:
మద్యం తాగి వాహనాలు నడపవద్దని ఇండియాలోనే కాదు... ఏ దేశంలో ఎంతలా చెబుతున్నా... లిక్కర్ లవర్స్ మాత్రం డ్రైవింగ్ చేస్తూనే ఉన్నారు. అమెరికా... కొలరాడోలోని డెన్వర్‌లో... తాగి కారు నడుపుతున్న ఓ వ్యక్తిని ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు అడ్డుకున్నారు. మద్యం మత్తులో ఉన్న అతడు... ఏంటి సార్... కార్ ఎందుకు ఆపారు అంటూ కిందకు దిగాడు. అతన్ని ఏదో ప్రశ్నించబోతూ అధికారులు... కారువైపు చూసి షాకయ్యారు. ఎందుకంటే... అప్పటిదాకా అతడు డ్రైవింగ్ చేసిన సీటు వెనక నుంచీ... 15 అడుగుల పాము మెల్లిగా పాకుతూ... కనిపించింది. అది విండో లోంచీ బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. దాన్ని చూడగానే... ఏయ్... పాము... నీ కారులోకి అదెలా వచ్చింది... అంటూ దాన్ని ఎలా పట్టుకోవాలో, అది ఏం చేస్తుందో అని టెన్షన్ పడుతుంటే... నో ప్రాబ్లం సార్... అది నాదే. నేనే పెంచుకుంటున్నాను అని బాంబు పేల్చాడు ఆ కార్ ఓనర్.


తాగి వాహనం నడపడమే తప్పు... ఇక తనతో కారులో 15 అడుగుల పామును తీసుకెళ్లడం మరో తప్పు. రెండింటికీ కలిపి యాక్షన్ తీసుకున్న అధికారులు... ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ చెయ్యొద్దని చెబుతూనే... ఇలా కార్లు, వాహనాల్లో పాముల్ని తీసుకెళ్లొద్దని ప్రజలకు సూచించారు.

ప్రస్తుతం ఈ ఫొటోలు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో బాగా షేర్ అవుతున్నాయి. వీటికి టన్నుల కొద్దీ కామెంట్లు కూడా వస్తున్నాయి. తాగి డ్రైవ్ చేసే వాళ్ల వాహనంలో ప్రయాణించకూడదని పాములకు కూడా తెలిసి ఉండొచ్చు అని ఒకరు కామెంట్ పెడితే... ఆ పామును కాపాడినందుకు థాంక్స్ అని మరొకరు రాశారు. గతేడాది ఆస్ట్రేలియా... న్యూసౌత్‌వేల్స్‌లో ఇలాగే ఓ ఎరుపు, నలుపు రంగు స్నేక్ ఒకటి... కారులో కనిపించింది. అది ఎప్పుడు దూరిందో తనకు తెలియదన్నాడు ఆ కారు డ్రైవర్.
First published: July 17, 2019, 1:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading