హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Video: 144 అంతస్తుల భవనం 10 సెకన్లలోనే నిలువునా కూలిపోయింది

Video: 144 అంతస్తుల భవనం 10 సెకన్లలోనే నిలువునా కూలిపోయింది

అబుదాబిలో 144 అంతస్తుల భవనం కూల్చివేత (Image; GulfNews/Twitter)

అబుదాబిలో 144 అంతస్తుల భవనం కూల్చివేత (Image; GulfNews/Twitter)

పదుల సంఖ్యలో ఇంజినీర్లు, వేలాది మంది కార్మికులు కలసి కష్టపడి కట్టిన భవనం కేవలం 10 సెకన్లలోనే కుప్పకూలిపోయింది. ఈ ఘటన అబుదాబిలో జరిగింది.

144 అంతస్తుల భవనం. దాన్ని కట్టడానికి ఎంత కాలం పట్టి ఉండొచ్చు. కనీసం నాలుగైదు సంవత్సరాలు పట్టి ఉండొచ్చు. పదుల సంఖ్యలో ఇంజినీర్లు, వేలాది మంది కార్మికులు కలసి కష్టపడి కట్టిన భవనం కేవలం 10 సెకన్లలోనే కుప్పకూలిపోయింది. ఈ ఘటన అబుదాబిలో జరిగింది. ఇది అబుదాబిలోని మీనా జాయేద్ ప్రాంతంలో ఉన్న మీనా ప్లాజా టవర్. ప్రఖ్యాతమైన ఈ టవర్‌ను కేవలం 10 సెకన్లలోనే కూల్చేశారు. 165 మీటర్ల ఎత్తయిన ఈ ప్లాజా ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా చోటు సంపాదించింది. ఎక్స్‌ప్లోజివ్స్‌తో కూల్చేసిన అత్యంత ఎత్తయిన భవనంగా పేరుగాంచింది. సుమారు 600 కేజీల బరువైన ప్లాస్టిక్ పేలుడు పదార్థాలు, 1800 డిటోనేటర్లను ఈ భవనం కూల్చివేతకు ఉపయోగించారని గల్ఫ్ న్యూస్ తెలిపింది. మీనా జాయేద్‌ రీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా అత్యంత భారీ భవనాన్ని కూల్చి వేశారు. ఈ భవనాన్ని కూల్చివేయడం ద్వారా అబుదాబిలో అత్యంత పేరుగాంచిన టూరిస్ట్ ప్రదేశం అయిన పోర్ట్ ప్రాంతానికి ఇప్పుడు రూట్ క్లియర్ అవుతుంది.

మీనా జాయేద్‌లో ఈ భవనాన్ని 1972లో కట్టారు. అంటే, 42 సంవత్సరాలు పూర్తయింది. అబుదాబిలో ప్రధాన పోర్టుగా ఇది 40 ఏళ్ల పాటు సేవలు అందించింది. ఈ భవనాన్ని కూల్చే సమయంలో పూర్తిస్థాయి భద్రతా చర్యలు తీసుకున్నామని అబుదాబి పోలీసులు చెప్పారు. పూర్తి కంట్రోల్‌లోనే కంట్రోల్‌లోనే పేల్చామని చెప్పారు.

‘ప్లాస్టిక్ పేలుడు పదార్థాలను వాడడం ద్వారా రక్షణ ఉంటుంది. అందుకే, వాటిని వినియోగించి భవనాన్ని కూల్చి వేశాం. ఎలక్ట్రిక్ సిగ్నల్స్‌తో దాన్ని కూల్చేశాం. సివిల్, డిఫెన్స్ విభాగాల సమన్వయంతో కలసి దీన్ని కూల్చి వేశాం.’ అని అబుదాబి అధికారులు తెలిపారు.

First published:

Tags: UAE

ఉత్తమ కథలు