news18-telugu
Updated: December 22, 2019, 8:13 PM IST
ప్రతీకాత్మక చిత్రం
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. చికాగోలో జరిగిన హౌజింగ్ పార్టీలో చోటు చేసుకున్న ఘర్షణ కాల్పులకు దారితీసింది. కాల్పుల్లో 13 మంది గాయపడగా.. అందలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు స్థానిక పోలీస్ అధికారి ఫ్రెడ్ వాలెర్ అన్నారు. గాయపడ్డవారిలో 16 ఏళ్ల వయసు నుంచి 48 ఏళ్ల వయసు ఉన్న మహిళలు,పురుషులు ఉన్నట్టు చెప్పారు. కాల్పులకు పాల్పడినట్టుగా అనుమానిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఇంట్లో కాల్పులు జరపడంతో.. అంతా భయంతో బయటకు పరుగులు తీశారని చెప్పారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు.
Published by:
Srinivas Mittapalli
First published:
December 22, 2019, 8:05 PM IST