హెలికాప్టర్లు ఢీకొని 13 మంది సైనికుల మృతి..

రెండు హెలికాప్టర్లు ఢీకొని ఫ్రాన్స్‌కు చెందిన 13 మంది సైనికులు మృతిచెందారు. ఆఫ్రికాలోని మాలిలో ఈ దారుణం చోటుచేసుకుంది.

news18-telugu
Updated: November 27, 2019, 6:34 AM IST
హెలికాప్టర్లు ఢీకొని 13 మంది సైనికుల మృతి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రెండు హెలికాప్టర్లు ఢీకొని ఫ్రాన్స్‌కు చెందిన 13 మంది సైనికులు మృతిచెందారు. ఆఫ్రికాలోని మాలిలో ఈ దారుణం చోటుచేసుకుంది. మాలిలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఫ్రాన్స్‌కు చెందిన సైనికులు రంగంలోకి దిగారు. అందులో ఆరుగురు అధికారి స్థాయి, మరో ఆరుగురు నాన్ కమిషన్‌డ్ సైనికులు ఒక మాస్టర్ కార్పోరల్ ఉన్నారు. అయితే.. ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో గగనతనంలో ఉన్న హెలికాప్టర్ పైలట్లు ఎదురెదురుగా వస్తున్నట్లు గుర్తించలేదు. దీంతో ఒకదానికి ఒకటి ఢీకొని 13 మంది దుర్మరణం చెందారు. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆఫీస్ ఒక ప్రకటన విడుదల చేసింది. అమర జవాన్లకు నివాళి అర్పించిన ఆయన.. కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వీర జవాన్లు తమ ప్రాణాలను అర్పించి, ఉగ్రవాద నిర్మూలనకు బరిలోకి దిగారని అన్నారు. కాగా, 1983 బైరూట్ బరాక్స్ బాంబింగ్ తర్వాత పెద్ద మొత్తంలో సైనికులు చనిపోవడం ఇదే తొలిసారి. 1983 బాంబ్ బ్లాస్ట్‌లో 58 మంది సైనికులు వీర మరణం పొందారు.

ఈ ఆఫ్రికా దేశంలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు 2014లో ఫ్రాన్స్ 4500 మంది బలగాలను రంగంలోకి దించింది. అప్పటి నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ఆ దేశ సైనికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ అంశాన్ని కూడా గుర్తు చేసిన మాక్రాన్ సైనికుల ధైర్యాన్ని కొనియాడారు.

First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు