బ్రెడ్ విసిరి దుండగుడిని తరిమికొట్టిన బాలిక... వైరల్ వీడియో

Viral Video : చేతిలో కత్తి, ముఖానికి స్కార్ఫ్... వేగంగా దూసుకొస్తున్న ఆ దుండగుణ్ని చూస్తే... పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది ఆ బాలిక మాత్రం అతన్ని ఎదిరించింది. పారిపోయేలా చేసింది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 21, 2019, 1:45 PM IST
బ్రెడ్ విసిరి దుండగుడిని తరిమికొట్టిన బాలిక... వైరల్ వీడియో
బ్రెడ్ విసిరి దుండగుడిని తరిమికొట్టిన బాలిక... వైరల్ వీడియో (Credit - FB - Sussex Police)
  • Share this:
England : ఫ్రెండ్లీ పోలీసింగ్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా... ఇంగ్లండ్‌లోని సస్సెక్స్ పోలీసుల్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్లు ఎప్పటికప్పుడు... ప్రజలతో కనెక్ట్ అవ్వడమే కాదు... సోషల్ మీడియాలో కూడా జరిగే సంఘటనలపై అప్‌డేట్స్ ఇస్తుంటారు. తాజాగా వాళ్లు... ఓ సీసీకెమెరా ఫుటేజ్‌ను ప్రజలకు ఫేస్‌బుక్‌లో అందుబాటులో ఉంచారు. ఇందులో ఓ కత్తి పట్టుకున్న దుండగుడు న్యూలాండ్స్ రోడ్డులోని ఎక్స్‌ప్రెస్ సూపర్‌మార్కెట్‌లోకి చొరబడ్డాడు. ముఖానికి స్కార్ఫ్ వేసుకోవడంతో అతను ఎవరన్నదీ తెలియట్లేదు. డబ్బు దోచుకోవడానికి క్యాష్ రిజిస్టర్ దగ్గరకు వెళ్లసాగాడు. ఐతే... అక్కడే ఉన్న ఓ 11 ఏళ్ల బాలిక అతని స్కార్ఫ్‌ని లాగేందుకు ప్రయత్నించింది. ఉలిక్కిపడిన దొంగ... ఏదో ఒకటి చేసేలోపే... ఆ బాలిక, ఆమె తండ్రి... అక్కడున్న బ్రెడ్‌లు, రెండు బాటిళ్లను అతనిపైకి వరుసగా విసిరారు. దాంతో కంగారుపడిన దొంగ... ఏమీ దోచుకోకుండానే అక్కడి నుంచీ పారిపోయాడు. ఆ బాలిక సాహసాన్ని అక్కడున్న సీసీకెమెరా రికార్డ్ చేసింది. ఆ వీడియోని పోలీసులు ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా మంది ఇది చూసి... ఆ బాలికను మెచ్చుకుంటున్నారు. దొంగ చేతిలో కత్తిని చూసి కూడా ఆ బాలిక ప్రాణాలకు తెగించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం పోలీసులు ఆ దొంగ ఎవరో కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే, చెప్పమని కోరుతున్నారు.

First published: September 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు