Japan Citizens :హట్సాఫ్ టు సీనియర్ సిటిజన్స్.. వంద సంవత్సరాలు దాటిన పనికి రెఢీ..

Japan Citizens :హట్సాఫ్ టు సీనియర్ సిటిజన్స్.. వంద సంవత్సరాలు దాటిన పనికి రెఢీ..

Japan Citizens : జపాన్ అంటే మానవ వనరుల కొరత . ఆ దేశంలో యువకుల శాతం తక్కువగా ఉండడతో ఆర్థిక స్వాలంబలన కోసం వయో వృద్దులు కూడా ప్రతి రోజు పని చేసేందుకే ఇష్టపడుతుంటారు.. దీంతో వంద సంవత్సరాలు ఉన్న వృద్దులు కూడా తమకు తోచిన పనిని చేసేందుకు ముందుకు వస్తున్నారు.

 • Share this:
  సాధారణంగా 60 సంవత్సరాలు సగటు మానవులు తమ పని చేసుకోవడానికి తప్ప ఇతర ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించే శక్తిని కోల్పోతారు. దీంతో వారు చాలా దేశాల్లో పూర్తిగా ఇంటిపట్టునే ఉంటూ రెస్ట్‌లోకి వెళతారు.. ఇక బారత దేశంలో మాత్రం చాలా మంది ఆరవై దాటిందంటే ఇక చాలు అన్నట్టు వ్యవహరిస్తారు. ఇట్లో ఉన్న పిల్లలు కుటుంబ సభ్యులతోనే కాలం గడిపేస్తారు.

  అయితే శ్రామిక దేశం జపాన్‌లో ( Japan ) మాత్రం అక్కడి వృద్దులు మాత్రం బిన్నంగా ఉన్నారు.. అక్కడి వృద్దులు వివిధ ఉద్యోగాలనూ చేస్తూ తమ జీవితాల్ని తామే శాసించుకుంటున్నారు. జపాన్‌లో పదవీ విరమణ తర్వాత కూడా, వృద్ధులు తమను తాము ఫిట్‌గా ( fitness )ఉంచుకోవడానికి పని చేస్తూనే ఉంటారు. ఇది వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని వారి నమ్మకం... దీంతో పాటు, అదనపు ఆదాయం ( extra income ) కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఆ దేశంలో జనన రేటు చాలా తక్కువ, కాబట్టి యువత కొరత ఉంటుంది. పని చేసే యువత తక్కువగా ఉంటారు.. దీంతో ఆమె జపాన్‌లోని ఏడు మిలియన్ల మంది ఇతర సీనియర్ సిటిజన్‌ల వలె సిల్వర్ జింజాయ్ అనే ఉద్యోగ సంస్థలో నమోదు చేసుకున్నారు.

   ఇది చదవండి : ప్రపంచ కుబేరుడి కూతురు వివాహం ..ఖర్చు ఎంతో తెలుసా..?


  నిజానికి, ప్రతి నలుగురు జపనీయులలో ఒకరు 65 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు... ప్రతి 15 మందిలో ప్రతి ముగ్గురు జపనీస్‌లో ఒకరు 65 ఏళ్లు దాటి ఉంటారు. జపాన్ జనాభా వృద్ధాప్య రేటు జర్మనీ కంటే రెండు రెట్లు.. ఫ్రాన్స్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ. అటువంటి పరిస్థితిలో, జపాన్ ప్రభుత్వం నిర్బంధ విరమణ వయస్సును 65 నుండి 70 సంవత్సరాలకు పెంచింది. తద్వారా జపాన్‌లో కార్మికుల కొరత ఉండదు.

  ఇది చదవండి : చెత్తలో పది తులాల బంగారం.. తిరిగి అప్పగించిన పారిశుద్ద్య కార్మికురాలు..


  100 సంవత్సరాల వయస్సు ఉన్నవారు కూడా వారానికి 3 రోజులు పని చేస్తున్నారు. దీంతో టోక్యో విశ్వవిద్యాలయం ప్రొ. హిరోషి యోషిడా జపాన్‌లో, వృద్ధులలో పని చేసే ధోరణి నిరంతరం పెరుగుతోందని చెప్పారు.ఉద్యోగాల కోసం నమోదు చేసుకున్న అత్యంత పెద్దవయసు గల 100 సంవత్సరాలు. వృద్దులు వారానికి 20 గంటల వరకు పని చేస్తారు. ప్రతి వారం వారు రెండు లేదా మూడు రోజులు పని చేయాలి. ఈ పెద్దలు క్లీనర్లు, తోటమాలి, ఆఫీసు రిసెప్షన్‌లు, వడ్రంగులు.. బేబీ సిటింగ్‌గా కూడా పని చేస్తారు.
  Published by:yveerash yveerash
  First published: