• Home
  • »
  • News
  • »
  • international
  • »
  • 10 YEAR OLD BOY ASKED TO REMOVE TSHIRT ON NEWZEALAND FLIGHT IT HAD PICTURE OF SNAKE ON IT MS

టీషర్ట్ విప్పితేనే విమానం లోపలికి అనుమతి.. ఎయిర్‌పోర్టులో వింత సంఘటన

ఎయిర్ ఇండియా విమానం (File)

దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్ విమానాశ్రయంలో 10 ఏళ్ల స్టీవి లుకాస్ అనే బాలుడికి చేదు అనుభవం ఎదురైంది.

  • Share this:
    దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్ విమానాశ్రయంలో 10 ఏళ్ల స్టీవి లుకాస్ అనే బాలుడికి చేదు అనుభవం ఎదురైంది. తల్లిదండ్రులతో కలిసి న్యూజిలాండ్ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన అతన్ని అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. స్టీవి లుకాస్ ధరించిన టీషర్ట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. టీషర్ట్ మార్చుకుంటేనే విమానంలోకి అనుమతిస్తామన్నారు. అతను ధరించిన టీషర్ట్‌పై కోబ్రా స్నేక్ బొమ్మ ముద్రించి ఉండటం.. అది కాస్త భయపెట్టే రీతిలో ఉండటంతో అభ్యంతరం తెలిపారు. దీంతో అతని తల్లిదండ్రులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే అలాంటి టీషర్ట్‌తో లోపలికి వెళ్తే మిగతా ప్రయాణికులు భయపడే అవకాశం ఉందని సిబ్బంది చెప్పారు. దీంతో చేసేదేమి లేక అతని టీషర్ట్ విప్పించి మరో టీషర్ట్ తొడిగించారు. అనంతరం సిబ్బంది విమానంలోకి అనుమతించారు.


    Published by:Srinivas Mittapalli
    First published: