హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

US Gun culture: అమెరికా ఇక మారదా..? ఇంకెన్నాళ్లీ తుపాకుల మోత..? అక్కడి గన్ కల్చర్‌ లెక్కలు చూస్తే చెమటలు పట్టాల్సిందే!

US Gun culture: అమెరికా ఇక మారదా..? ఇంకెన్నాళ్లీ తుపాకుల మోత..? అక్కడి గన్ కల్చర్‌ లెక్కలు చూస్తే చెమటలు పట్టాల్సిందే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

US gun culture: అమెరికాలో ఏ పౌరుడి చేతిలో గన్‌ ఉన్నా అది పిచ్చోడి చేతిలో రాయి లాగే లెక్క..! అయితే గన్‌తో ఆత్మహత్య చేసుకోవడం లేకపోతే అదే గన్‌తో ఇతరుల ప్రాణాలను తీయడం అక్కడ మోస్ట్ కామన్‌ థింగ్‌..!

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఎప్పుడు చూసినా అవే శబ్దాలు..! అదే మోత..! ఎదో క్రైమ్ యాక్షన్ సినిమాలో హీరో ఇష్టం వచ్చినట్లు గన్‌ను వాడినట్లు అక్కడ నిత్యం గన్‌ ఉన్మాదులు రెచ్చిపోతూనే ఉన్నారు..! పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో..! ప్రపంచానికే పెద్దన్న పాత్ర పోషించే అమెరికా (America) ను గన్‌ కల్చర్‌ (US gun Culture)  వల్చర్‌లా పీక్కు తింటోంది. మాస్‌ షూటింగ్స్‌కు ఏనాడో కేరాఫ్‌గా మారిపోయిన అగ్రరాజ్యం.. ఈ విష సంస్కృతి నుంచి బయటపడలేక పోతోంది. మునపటి రోజు నెత్తుటి మరకలు అరకముందే మరో రోజుకి ప్రవేశించాల్సిన దుస్థితి నెలకొంది. గతేడాది జరిగిన టెక్సాస్ పాఠశాల మాస్ షూటింగ్ ఘటనైనా.. తాజాగా 10మంది ప్రాణాలు బలిగొన్న లాస్​ఏంజెల్స్‌ మాంటెరీ పార్క్ ఘటనైనా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అటు అమెరికా గన్‌ వయలెన్స్‌ లెక్కలు మరింత భయపెట్టిస్తున్నాయి.

  చంపడం లేదా చావడం:

  అమెరికాలో ఏ పౌరుడి చేతిలో గన్‌ ఉన్నా అది పిచ్చోడి చేతిలో రాయి లాగే లెక్క..! అయితే గన్‌తో ఆత్మహత్య చేసుకోవడం లేకపోతే అదే గన్‌తో ఇతరుల ప్రాణాలను తీయడం అక్కడ మోస్ట్ కామన్‌ థింగ్‌..! ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశంలోనూ లేనంత తుపాకీ హింస అమెరికాలో ఉందని అంతర్జాతీయ రిపోర్టులు చెబుతున్నాయి. అక్కడ ప్రతిరోజు 110మంది తుపాకీ సంస్కృతికి బలైపోతున్నారు. ఇందులో మర్డర్స్‌తో పాటు సూసైడ్‌లూ ఉన్నాయి. ఏడాదికి సగటున 40,620 మంది ప్రజలు ఈ గన్‌ కల్చర్‌కు మరణిస్తున్నారట. 2009 నుంచి ఇప్పటివరకు ఏడాదికి సగటున 19 మాస్‌ షూటింగ్స్‌ జరుగుతున్నాయట..! ఈ సాముహిక కాల్పుల్లో యావరేజ్‌గా ప్రతి ఘటనకు నలుగురు చొప్పున బలైపోతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అటు తుపాకీ హత్యల రేటు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇతర అధిక ఆదాయ దేశాలతో పోలిస్తే 26 రెట్లు ఎక్కువగా తుపాకీతో హత్యలు.. 12రెట్లు అధికంగా తుపాకీతో ప్రజలు ఆత్మహత్య చేసుకుంటుండడం అక్కడి దారుణ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.

  మనుషుల కంటే తుపాకులే ఎక్కువ:

  అమెరికాలో తుపాకీ ఏదైనా నిత్యావసర వస్తువా అన్న రేంజ్‌లో అక్కడి గన్‌ల సంఖ్య ఉండడం మరింత కలవర పెడుతోంది. అమెరికా జనాభా కంటే అక్కడ తుపాకుల సంఖ్య ఎక్కువ. 2018 లెక్కల ప్రకారం అమెరికా జనాభా 33 కోట్లు ఉండగా అక్కడ ఉన్న తుపాకుల సంఖ్య మాత్రం 39 కోట్లు. అంటే ప్రతి 100మందికి దాదాపు 121 తుపాకులున్నట్లు లెక్క. అమెరికా తర్వాతి స్థానంలో ఉన్న యెమన్‌లో ప్రతి 100మందికి 52గన్‌లు ఉండగా.. అగ్రరాజ్యంలో మాత్రం దానికంటే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువగా తుపాకుల సంఖ్య ఉంది.

  శ్వేతజాతీయుల వద్దే ఎక్కువగా గన్‌ ఓనర్‌షిప్‌:

  శాస్త్ర సాంకేతిక రంగంలో అమెరికా ఎంత ఎదిగినా లోలోపల పాతుకుపోయిన జాత్యహంకార మహమ్మారి మాత్రం అగ్రరాజ్యాన్ని వదలడంలేదు. అక్కడి శ్వాతజాతీయుల్లో వందల ఏళ్లుగా నాటుకుపోయిన ఈ వివక్ష ఈనాటీకి విషం చిమ్ముతూనే ఉంది. అమెరికా గన్‌ కల్చర్‌లో ప్రధాన పాత్ర ఈ జాతి వివక్షదే..! అవును..! నల్లజాతీయుల కంటే తెల్లజాతీయుల వద్దే తుపాకులు ఎక్కువ ఉంటున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అంతేకాదు.. దాడులు కూడా నల్లజాతీయులే టార్గెట్‌గానే ఎక్కువగా జరుగుతున్నాయట. ఇందులో ఇంకో ఆసక్తికర విషయం కూడా ఉంది. గన్‌ను ఎక్కువగా వాడుతున్నవారిలో ఎక్కువమంది రిపబ్లికన్లేనట..! అందుకే గన్‌ కంట్రోల్‌ చట్టాలకు సెనేట్‌లో రిబబ్లికన్‌ పార్టీ అడ్డుతగులుతుంటోంది. ఓపెన్‌గానే గన్‌ కల్చర్‌కు రిపబ్లికన్‌ పార్టీ మద్దతు తెలుపుతుంటోంది. ఏడాదికి వేలాది ప్రాణాలు తుపాకీ తుటాలకు బలైపోతున్నా.. తమకు వ్యాపారమే ఇంపార్టెంట్‌ అన్న విధంగా ఆ పార్టీ ప్రతినిధుల తీరు ఉంటుంది. ఎందుకంటే ఆయుధాల మాఫియాదే అక్కడ శాసనం. అదంతా వందల కోట్ల డాలర్ల బిజినెన్‌ మరి.

  లాస్‌ ఏంజెల్స్‌ ఘటన అనుమానితుడి ఆత్మహత్య!

  లాస్​ఏంజెల్స్‌ మాంటెరీ పార్క్ కాల్పుల ఘటనకు అనుమానితుడిగా భావిస్తోన్న వృద్ధుడు ఆత్యహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. కాల్పులు జరిపిన తర్వాత తనకు తానే అదే గన్‌తో కాల్చుకున్నట్ సమాచారం. అనుమానితుడు చైనా నుంచి వలస వచ్చిన హూ కాన్‌ ట్రాన్‌గా గుర్తించారు. అయితే ట్రాన్‌ ఎందుకీ మారణహోమానికి పాల్పడ్డాడు...? చైనీయులే టార్గెట్‌గా ఈ కాల్పులు ఎందుకు జరిపాడు..? అన్నదానిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

  First published:

  Tags: America, International news, Us news, USA

  ఉత్తమ కథలు