జర్మనీలో భారతీయ దంపతులపై దాడి.. భర్త మృతి..

Indian Couple Stabbed In Germany : ప్రశాంత్-స్మిత దంపతుల పిల్లలు సాక్షి, శ్లోక ప్రస్తుతం జర్మనీలోని భారత దౌత్య అధికారుల పర్యవేక్షణలో ఉన్నట్టు సమాచారం.

news18-telugu
Updated: March 30, 2019, 5:07 PM IST
జర్మనీలో భారతీయ దంపతులపై దాడి.. భర్త మృతి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 30, 2019, 5:07 PM IST
జర్మనీలోని మ్యూనిచ్‌లో ఓ భారతీయ జంటపై దాడి జరిగింది. గుర్తు తెలియని ఇమ్మిగ్రెంట్(వలసదారుడు) వారిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. దాడిలో భర్త మృతి చెందగా.. భార్య తీవ్ర గాయాలపాలైంది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. వారి పిల్లల భద్రతను పర్యవేక్షించాల్సిందిగా మ్యూనిచ్‌లోని భారత దౌత్య కార్యాలయాన్ని ఆదేశించినట్టు తెలిపారు.

భారతీయ దంపతులు ప్రశాంత్, స్మిత బసరూర్ మ్యునిచ్‌లో ఓ ఇమ్మిగ్రెంట్ చేతిలో దాడికి గురయ్యారు. దురదృష్టవశాత్తు దాడిలో ప్రశాంత్ చనిపోయాడు. ప్రస్తుతం స్మిత పరిస్థితి నిలకడగా ఉంది.ప్రశాంత్ సోదరుడిని భారత్ నుంచి జర్మనీ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రశాంత్‌ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్


ప్రశాంత్-స్మిత దంపతుల పిల్లలు సాక్షి, శ్లోక ప్రస్తుతం జర్మనీలోని భారత దౌత్య అధికారుల పర్యవేక్షణలో ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే, ప్రశాంత్-స్మిత ఇద్దరూ మంగళూరు యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు. 2016లో జర్మనీలోని ఎయిర్‌బస్ హెలికాప్టర్స్ సంస్థలో పనిచేసేందుకు ప్రశాంత్ జర్మనీ వెళ్లారు. వీరికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

First published: March 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...