Home /News /international /

1 DEAD ANOTHER INJURED IN CAR EXPLOSION OUTSIDE WOMEN HOSPITAL IN LIVERPOOL IN UK THREE ARRESTED UNDER TERRORISM ACT MKS

Liverpool explosion : మహిళా ఆస్పత్రిపై ఉగ్రదాడి! -యూకేలో కారు పేలుడు బీభత్సం -ఏం జరిగిందంటే

లివర్ పూల్ ఆస్పత్రి వద్ద కారు పేలుడు

లివర్ పూల్ ఆస్పత్రి వద్ద కారు పేలుడు

బ్రిటన్ ఉత్తరప్రాంతంలోని ప్రఖ్యాత లివర్ పూల్ సిటీలో కారు పేలుడు సంభవించింది. రద్దీగా ఉండే మహిళా ఆస్పత్రి వద్ద ఆదివారం ఉదయం పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, మరొకరికి గాయాలయ్యాయి. పేలుడుతో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తోన్న ముగ్గురు యువకులను ఉగ్రవాద నిరోధక చట్టం కింద అరెస్టు చేశారు. వివరాలివి...

ఇంకా చదవండి ...
ఇస్లామిస్ట్ ఉగ్రవాదులకు బ్రిటన్ (UK) ఈజీ టార్గెట్ గా మారిందా? అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీని ఉగ్రవాదులు హత్య చేసిన తర్వాత కూడా అక్కడ పరిస్థితి మారలేదా? ఇన్నాళ్లూ రైల్వే స్టేషన్, బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రదేశాలను టార్గెట్ చేస్తూ వచ్చిన ఉగ్రవాదులు (Terrorists) ఇప్పుడు ఏకంగా ఆస్పత్రులపై పడ్డారా? అంటే అనుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా బ్రిటన్ ఉత్తరప్రాంతంలోని ప్రఖ్యాత లివర్ పూల్ సిటీలో కారు పేలుడు సంభవించింది. ఈ ఘటన తర్వాత ముగ్గురు యువకులను ఉగ్రవాద నిరోధక చట్టం కిందటే అరెస్టు చేయడాన్ని బట్టి కూడా ఇది ఎలాంటి చర్యో అర్థమవుతోంది. అయితే, అధికారులు మాత్రం ఇది ఉగ్రదాడేనని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. వివరాలివి..

వాయువ్య ఇంగ్లాండ్ లోని మెర్సీసైడ్ కౌంటీ పరిధిలోకి వచ్చే ప్రఖ్యాత నగరం లివర్ పూల్ లో (స్థానిక కాలమానం ప్రకారం) ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఇక్కడి మహిళా ఆస్పత్రి వద్ద నిలిపి ఉన్న ఓ కారు ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఆ సమయంలో ఆస్పత్రిలోని గర్భిణిలు, బాలింతలు షాక్ కు గురయ్యారు. ట్యాక్సీగా భావిస్తోన్న ఆ కారులో వెనుక భాగంలో కూర్చున్న ప్రయాణికుడు ఘటనా స్థలంలోనే చనిపోగా, డ్రైవర్ మాత్రం గాయాలతో బయటపడ్డాడు. ఇది ఆత్మాహుతి దాడా? లేక వారికి తెలియకుండా కారులో పేలుడు పదార్థాలు అమర్చారా? అనేది తెలియాల్సి ఉంది.

hyderabad : హీరోయిన్ చౌరాసియాపై దాడి -గాయాలతో 100కు ఫోన్.. కేబీఆర్ పార్క్‌లో షాకింగ్ ఘటన


లివర్ పూల్ మహిళా ఆస్పత్రి వద్ద పేలుడు ఘటనలో యావత్ బ్రిటన్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సరిగ్గా నెలరోజుల కిందట్ అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ డేవిడ్ అమీస్ ను ఓ చర్చిలో ఉగ్రవాదులు పొడిచి చంపిన ఘటనపై విచారణ సాగుతుండగానే ఇప్పుడు లివర్ పూల్ లో పేలుడు జరగడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. పేలుడు ఘటన తర్వాత ఆస్పత్రిని తాత్కాలికంగా మూసేసిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

Imran Khan : ఇమ్రాన్ ఖాన్ ఇన్నింగ్స్ ఖతం -గద్దె దించనున్న ఆర్మీ -కారణాలివే -pakistan కొత్త ప్రధాని ఎవరంటే


లివర్ పూల్ కారు పేలుడు ఘటనతో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తోన్న ముగ్గురు యువకులను యాంటీ టెర్రరిజం యాక్ట్ కిందట బలగాలు అరెస్టు చేశాయి. ఆ ముగ్గురూ 21 నుంచి 26 ఏళ్ల మధ్య వయస్కులేనన్న పోలీసులు.. ఇతర వివరాలేవీ చెప్పలేదు. అనుమానితుల్ని ఉగ్రవాద చట్టం కింద అరెస్టుచేసినప్పటికీ, కారు పేలుడు ఘటనను మాత్రం ఉగ్ర చర్యగా పోలీసులు ఇంకా ప్రకటించలేదు. లివర్ పూల్ కారు పేలడు ఘటనపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సానుభూతి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది..
Published by:Madhu Kota
First published:

Tags: Blasts, Gas blast, United Kingdom

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు