Home /News /international /

0 KILLED IN FIRE AT PHARMA FACTORY IN CHINA SK

ఫార్మా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం...10 మంది దుర్మరణం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మార్చి 22న చైనా చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదం జరిగింది. యాంచెంగ్‌లోని ఓ పెస్టిసైడ్ ఫ్యాక్టరీలో శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి. ఆ దుర్ఘటనలో 78 మంది చనిపోగా, 600 మంది గాయపడ్డారు.

    చైనాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. షాండాంగ్ ప్రావిన్స్‌లో ఓ ఫార్మా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 10 మంది చనిపోగా, మరో 12 మందికి గాయాలయ్యాయి. జినాన్ సిటీ శివారులో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని కీలల ధాటికి భారీ మొత్తంలో ఆస్తినష్టం వాటిల్లినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తుచేస్తున్నారు.

    చైనాలోని పారిశ్రామికవాడల్లో తరచూ అగ్రిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత నెల రోజుల్లో ఇది నాలుగో అతిపెద్ద అగ్నిప్రమాదం. మార్చి 31న జియాంగ్జు ప్రావిన్స్‌లో లోహాలను కరిగించే కర్మాగారంలో అగ్నిప్రమాదం జరిగి పదుల సంఖ్యలో కార్మికులు చనిపోయారు. మరికొందరు గాయాలపాలయ్యారు. మార్చి 30న షాండేంగ్‌లోని ఓ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఐదుగురు మరణించారు.

    ఇక మార్చి 22న చైనా చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదం జరిగింది. యాంచెంగ్‌లోని ఓ పెస్టిసైడ్ ఫ్యాక్టరీలో శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి. ఆ దుర్ఘటనలో 78 మంది చనిపోగా, 600 మంది గాయపడ్డారు. ప్రమాదం ధాటికి చుట్టుపక్కల ఫ్యాక్టరీలు కూడా కుప్పకూలాయి. ఇండస్ట్రియల్ పార్క్ మొత్తం మూతపడింది. ఈ ఘటన తర్వాత చైనా ప్రభుత్వం మేల్కొని...దేశంలోని రసాయన కర్మాగారాలపై తనిఖీలు ముమ్మరం చేసింది.
    First published:

    Tags: BLAST, China, Fire Accident

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు