చైనాకి చెక్... జొమాటో టీ షర్ట్స్ తగలబెట్టిన ఉద్యోగులు... దేశభక్తిని మెచ్చుకున్న నెటిజన్లు

వాళ్లు రోడ్డుపై టీ షర్ట్స్ తగలబెడుతుంటే... అంతా ఆశ్చర్యంగా చూశారు. దేనికి ఇలా చేస్తున్నారని అడిగారు. అసలు విషయం తెలిశాక... తప్పు లేదు తమ్ముళ్లూ అన్నారు.

news18-telugu
Updated: June 28, 2020, 12:25 PM IST
చైనాకి చెక్... జొమాటో టీ షర్ట్స్ తగలబెట్టిన ఉద్యోగులు... దేశభక్తిని మెచ్చుకున్న నెటిజన్లు
చైనాకి చెక్... జొమాటో టీ షర్ట్స్ తగలబెట్టిన ఉద్యోగులు... దేశభక్తిని మెచ్చుకున్న నెటిజన్లు (credit - twitter)
  • Share this:
ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఉద్యోగులు తమదైన శైలిలో చైనాకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కోల్‌కతాలో కొంత మంది ఉద్యోగులు... తాము వేసుకున్న కంపెనీ టీషర్టులను చింపి మంటల్లో తగలబెట్టారు. కారణమేంటంటే... జొమాటో సంస్థలో చైనాకి చెందిన ఓ కంపెనీ పెట్టుబడి పెట్టింది. దాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈమధ్య జూన్ 15న గాల్వాన్ లోయలో... చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో భారత సైనికులు 20 మంది అమరులవ్వడంతో... వారికి మద్దతుగా... ఈ ఉద్యోగులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బెహాలాలో సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఉద్యోగులు తాము... జొమాటోలో ఉద్యోగం మానేస్తామనీ... ప్రజలు కూడా జొమాటో నుంచి ఫుడ్ డెలివరీ చేయించుకోవద్దని కోరారు.

2018లో చైనాకి చెందిన అలీబాబా కంపెనీలో భాగమైన యాంట్ ఫైనాన్షియల్ సంస్థ... జొమాటోలో 21 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టి... 14.7 శాతం వాటాను దక్కించుకుంది. ఈమధ్య జొమాటో సంస్థ... అదే యాంట్ ఫైనాన్షియల్ నుంచి మరో 15 కోట్ల డాలర్ల పెట్టుబడులు పొందింది. దీని వల్ల జొమాటోకి వచ్చే లాభాల్లో దాదాపు 25 శాతం చైనా కంపెనీకి వెళ్లనుంది. భారత భూభాగాన్ని లాక్కోవాలని చూస్తున్న చైనాలో సంస్థలకు... లాభాలు దక్కేలా చెయ్యడం కరెక్టు కాదని జొమాటో ఉద్యోగులు నిరసన తెలిపారు.ఆకలితో చావడానికైనా సిద్ధపడతాం గానీ... చైనా పెట్టుబడులు ఉండే కంపెనీల్లో మాత్రం పనిచేసే ప్రసక్తే లేదని మరో ఉద్యోగి అన్నారు. మే నెలలో జొమాటో... 13 శాతం ఉద్యోగుల్ని అంటే... 520 మంది మంది ఉద్యోగులను తొలగించింది. కారణం ఏంటంటే... కరోనా వైరస్ అని చెప్పింది. ఈ తాజా ఆందోళనలపై జొమాటో యాజమాన్యం ఇంకా స్పందించలేదు.
First published: June 28, 2020, 12:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading