చైనా భారీ కుట్ర...భారత్‌లో ఉగ్రదాడులకు మయన్మార్‌లో స్కెచ్... బయటపడ్డ ప్లాన్...

కొన్ని రోజుల క్రితం మయన్మార్-థాయిలాండ్ సరిహద్దులో ఉన్న మే టావో ప్రాంతంలో భారీ ఎత్తున చైనాకు చెందిన అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని అక్కడి తీవ్రవాదులకు అందించేందుకు తీసుకువెళుతున్నారు.

Krishna Adithya | news18-telugu
Updated: July 25, 2020, 9:40 PM IST
చైనా భారీ కుట్ర...భారత్‌లో ఉగ్రదాడులకు మయన్మార్‌లో స్కెచ్... బయటపడ్డ ప్లాన్...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
చైనా తన దుష్టపన్నాగాలకు పదును పెడుతూనే ఉంది. గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ అనంతరం చైనాను అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ఏకాకిగా నిలిపినా....బుద్ధి రాలేదు. ప్రస్తుతం భారత్ తో సరిహద్దులు పంచుకుంటున్న దేశాల్లో చిచ్చుపెట్టి, తద్వారా మన దేశంలో అశాంతి రేపేందుకు పన్నాగాలు పన్నుతోంది. ఇందులో భాగంగా ఈశాన్య భారత్ లో మరోసారి ఉగ్రవాద సమస్యను పెచ్చురిల్లే ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఐరోపాలోని ఒక థింక్ ట్యాంక్ సమాచారం ప్రకారం, కొన్ని రోజుల క్రితం మయన్మార్-థాయిలాండ్ సరిహద్దులో ఉన్న మే టావో ప్రాంతంలో భారీ ఎత్తున చైనాకు చెందిన అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని అక్కడి తీవ్రవాదులకు అందించేందుకు తీసుకువెళుతున్నారు. సైనికులు అప్రమత్తమైన అక్రమ ఆయుధముఠాను స్వాధీనం చేసుకున్నారు. యూరోపియన్ ఫౌండేషన్ ఫర్ సౌత్ ఏషియన్ స్టడీస్ (EFSAS), జూన్ 23 న ప్రచురించిన ఒక నివేదికలో "మయన్మార్‌లోని తీవ్రవాద గ్రూపులకు చైనా ఆయుధాలను రవాణా చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది" అని పేర్కొంది. మయన్మార్ లోని ఉగ్రవాద గ్రూపులకు చైనా మద్దతు ఇవ్వడం ద్వారా భారత్ లోని ఈశాన్య రాష్ట్రాల్లో అలజడి సృష్టించేందుకు చైనా కుట్ర చేస్తుందని నిపుణఉలు భావిస్తున్నారు.మయన్మార్ తీవ్రవాదులకు చైనా ఆయుధాలు..

మయన్మార్-థాయ్‌లాండ్ సరిహద్దులో స్వాధీనం చేసుకున్న ఆయుధాల చైనా సంబంధాలను ధృవీకరిస్తూ, యూరోపియన్ థింక్ ట్యాంక్ తన అంచనాలను విడుదల చేసింది. ఇందులో స్వాధీనం చేసుకున్న ఆయుధాలు చైనాలో తయారు చేసినవని నిర్ధారణకు వచ్చారు. ఈ సందర్భంగా జూలై 20 న, థాయ్‌లాండ్‌లోని భారత రాయబారి సుచిత్రా దురాయ్ తక్ ప్రావిన్స్ గవర్నర్ సంపూతరత్‌తో సమావేశం నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాల రవాణా గురించి సమగ్ర సమాచారం కోసం భారత భద్రతా సంస్థలకు సహకరించాలని కోరారు. అలాగే మయన్మార్‌ తో కూడా భారత నిఘా సంస్థలు సంప్రదింపులు జరుపుతున్నాయి.

india china border,india china conflict,india china face off,india china war,india china border dispute,india china,india china news,india,india china relations,india china faceoff,china,china india faceoff,ఇండియా చైనా యుద్ధం, ఇండియా చైనా వివాదం, ఇండియా చైనా సరిహద్దులు, భారత్ చైనా వివాదం,
ప్రతీకాత్మక చిత్రం


భారత్ సందేహం నిరాధారమైనది కాదు
యూరోపియన్ ఫౌండేషన్ ఫర్ సౌత్ ఏషియన్ స్టడీస్ అంచనా ప్రకారం 'మయన్మార్‌లో కొన్నేళ్లుగా ఆశ్రయం పొందుతున్న ఈశాన్య రాష్ట్రాల్లోని తిరుగుబాటుదారులు, రాఖైన్ స్టేట్ ఆఫ్ మయన్మార్‌లో మూలాలున్న AA ఉగ్రవాద సంస్థ రెండూ భారతదేశానికి భద్రతా సవాలుగా ఉన్నాయి. జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్నాయి. భారత్ చేపట్టిన లుక్ ఈస్ట్ పాలసీకి విరుద్ధంగా చైనా యొక్క వ్యూహాత్మక కుట్రతో వ్యవహరిస్తోందని థింక్ ట్యాంక్ అభిప్రాయపడింది. యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కోసం పనిచేస్తున్న మాజీ అధికారి అండర్స్ కోర్ అధ్యయన నివేదికలో 'మయన్మార్‌లో తన ప్రభావాన్ని నెలకొల్పడానికి చైనా టెర్రరిస్ట్ గ్రూపులకు నిధులు' మరియు ఆధునిక ఆయుధాలను అందిస్తోందని షాకింగ్ విషయాలను బయటపెట్టారు.
Published by: Krishna Adithya
First published: July 25, 2020, 9:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading